దారుణంగా జాతీయ రహదారి | - | Sakshi
Sakshi News home page

దారుణంగా జాతీయ రహదారి

Dec 6 2025 7:29 AM | Updated on Dec 6 2025 7:29 AM

దారుణంగా జాతీయ రహదారి

దారుణంగా జాతీయ రహదారి

నెల్లూరు(అర్బన్‌): కోవూరు నుంచి నెల్లూరు నగరం మీదుగా చైన్నె వెళ్లే నేషనల్‌ హైవేపై పలుచోట్ల కొన్నినెలలుగా గుంతలున్నాయి. శాశ్వత రిపేర్లు చేయించాల్సిన హైవే నిర్వాహకులు గోతుల్లో కంకర మట్టి వేసి వదిలేశారు. ప్రస్తుతం కురిసిన భారీ వర్షాలకు కంకర డస్ట్‌ కొట్టుకుపోయింది. నిత్యం ఈ మార్గం గుండా వేలాది వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. నేషనల్‌ హైవే నిబంధనల ప్రకారం చిన్నగుంత ఏర్పడినా అప్పటికప్పుడు దానిని పక్కాగా తారుతో పునర్నిర్మించాల్సి ఉంది. అయితే పాలకుల నిర్లక్ష్యం వల్ల నిర్వహణ అధ్వానంగా తయారైంది. సుందరయ్య కాలనీ – బుజబుజనెల్లూరు మధ్య పలుచోట్ల భారీగా గోతులున్నాయి. వాహనచోదకులుకు ఈ రోడ్లు నరకం చూపిస్తున్నాయి. కలెక్టర్‌ జోక్యం చేసుకుని గతుకులు లేని రోడ్లు నిర్వహించేలా చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement