పండ్ల వ్యాపారులపైకి దూసుకెళ్లిన కారు
● ఇద్దరు మహిళలకు గాయాలు
నెల్లూరు(క్రైమ్): కారు ఢీకొని ఇద్దరు పండ్ల వ్యాపారులకు గాయాలయ్యాయి. ఈ ఘటన శుక్రవారం నెల్లూరులోని ఏసీ కూరగాయల మార్కెట్ వద్ద చోటుచేసుకుంది. స్థానికులు, ట్రాఫిక్ సిబ్బంది కథనం మేరకు.. నగరానికి చెందిన ఓ వ్యక్తి వీఆర్సీ వైపు నుంచి ఆర్టీసీ బస్టాండ్ వైపు కారు నడుపుతూ బయలుదేరాడు. కారు మాజీ ప్రధాని నెహ్రూ విగ్రహం వద్దకు వచ్చేసరికి ఆటో అడ్డు వచ్చింది. అతను బ్రేక్‌కు బదులుగా ఎక్స్‌లేటర్ తొక్కాడు. దీంతో కారు వేగంగా రోడ్డు పక్కనే ఉన్న తోపుడు బండ్లపైకి దూసుకెళ్లి అక్కడే ఉన్న పోస్టుబాక్స్‌ను ఢీకొట్టి ఆగిపోయింది. ఈ ఘటనలో తోపుడు బండ్లపైకి పండ్లను విక్రయిస్తున్న ఇద్దరు మహిళలకు గాయాలయ్యాయి. క్షతగాత్రులను కారు నడుపుతున్న వ్యక్తి, స్థానికులు చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు అందలేదు. పూర్తి వివరాలు తెలియరావాల్సి ఉంది.
పండ్ల వ్యాపారులపైకి దూసుకెళ్లిన కారు


