కార్డన్ సెర్చ్‌లో 22 వాహనాల స్వాధీనం
నెల్లూరు(క్రైమ్): నెల్లూరు సంతపేట పోలీస్‌స్టేషన్ పరిధిలోని కపాడిపాళెంలో గురువారం తెల్లవారుజామున పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. నగర ఇన్‌చార్జి డీఎస్పీ ఎం.గిరిధర్ ఆధ్వర్యంలో పోలీస్ అధికారులు బృందాలుగా ఏర్పడి ప్రతి ఇంటిని క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఇంటి యజమానితోపాటు కుటుంబ సభ్యుల పూర్తి వివరాలను సేకరించారు. వాహనపత్రాల్లేని 19 మోటార్‌బైక్‌లు, ఒక ఆటో, రెండు కార్లను స్వాధీనం చేసుకున్నారు. నేర నియంత్రణ, అసాంఘిక కార్యక్రమాల కట్టడే లక్ష్యంగా నిర్వహిస్తున్న కార్డన్ సెర్చ్‌లకు ప్రజలు సహకరించాలని పోలీస్ అధికారులు కోరారు. ప్రజలు తమవంతు బాధ్యతగా అనుమానాస్పద వ్యక్తులు, చట్టవ్యతిరేక కార్యకలాపాలు, మత్తు, మాదకద్రవ్యాల వినియోగంపై డయల్ 112, స్థానిక పోలీసులకు సమాచారం అందిస్తే తగిన చర్యలు తీసుకుంటామన్నారు. సమాచారం అందించే వ్యక్తుల వివరాలను గోప్యంగా ఉంచుతామని చెప్పారు. కార్యక్రమంలో సంతపేట, చిన్నబజారు, నవాబుపేట, దర్గామిట్ట, బాలాజీనగర్ ఇన్‌స్పెక్టర్లు వైవీ సోమయ్య, చిట్టెం కోటేశ్వరరావు, జి.వేణుగోపాల్‌రెడ్డి, బి.కల్యాణరాజు, కె.సాంబశివరావు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
కార్డన్ సెర్చ్‌లో 22 వాహనాల స్వాధీనం


