అది ప్రభుత్వ భూమే..
ఆత్మకూరు: ఆత్మకూరు మండలంలోని బట్టేపాడు గ్రామ నడిబొడ్డున దివ్యమాంబ దేవాలయం ఎదురుగా ఉన్న కోటమిట్ట, దొరువు ప్రాంతాలు ప్రభుత్వానికి చెందినవి బోర్డు ఏర్పాటు చేశారు. ‘అడిగేదెవరు ఆపేదెవరు’ అనే శీర్షికతో సాక్షి దినపత్రికలో బుధవారం కథనం ప్రచురితమైన విషయం తెలిసిందే. తహసీల్దార్ పద్మజాకుమారి చర్యలు చేపట్టారు. దీంతో గురువారం ఆ ప్రాంతంలో ప్రభుత్వ భూమి అంటూ బోర్డులు పెట్టారు. అయితే కేవలం దొరువు, దాని సమీపంలోని గుడి వద్ద మాత్రమే (సర్వే నంబర్లు 898, 900) ఏర్పాటు చేశారని వాస్తవానికి 897, 899 సర్వే నంబర్లు కూడా ప్రభుత్వ భూమేనని, అక్కడ కూడా బోర్డు ఏర్పాటు చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు.
అది ప్రభుత్వ భూమే..


