ట్రాక్ దాటుతుండగా..
● రైలు ఢీకొని విద్యార్థిని మృతి
కావలి(అల్లూరు): రైలు ఢీకొని ఇంజినీరింగ్ విద్యార్థిని మృతిచెందిన ఘటన కావలి ఉదయగిరి బ్రిడ్జి ట్రాక్ వద్ద మంగళవారం చోటుచేసుకుంది. రైల్వే పోలీసుల కథనం మేరకు.. కొండాపురం మండలం సాయిపేట దళితవాడకు చెందిన పుండ్ల సురేష్, అనిత దంపతులకు కూతురు, కుమారుడు ఉన్నారు. సురేష్ వ్యవసాయం చేస్తూ పిల్లల్ని చూసుకుంటున్నాడు. కుమార్తె హవీలా షారోన్ (20) కావలిలో ఓ ప్రైవేట్ ఇంజినీరింగ్ కాలేజీలో బీటెక్ మూడో సంవత్సరం చదువుతోంది. హాస్టల్లో ఉంటోంది. ఇటీవల ఇంటికెళ్లింది. మంగళవారం ఉదయం తిరిగి కాలేజీకి వచ్చింది. మెటీరియల్ తెచ్చుకునేందుకు దగ్గరి దారి అని ఉదయగిరి బ్రిడ్జి వద్ద ఉన్న ట్రాక్ దాటుతుండగా ప్రమాదవశాత్తు రైలు ఢీకొని అక్కడికక్కడే మృతిచెందింది. షారోన్ మృతి విషయం తెలుసుకున్న తోటి విద్యార్థులు పెద్ద సంఖ్యలో ఘటనా స్థలానికి చేరుకున్నారు. రైల్వే పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కావలి ఏరియా హాస్పిటల్‌కు తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేశారు.
గరుడ వాహనంపై
నృసింహుడు
రాపూరు: పెంచలకోనలో పెనుశిల లక్ష్మీనరసింహస్వామి మంగళవా రం చందనాలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. శ్రీవారి జన్మనక్షత్రమైన స్వాతి నక్ష త్రం సందర్భంగా మూలమూర్తిని చందనంతో అలంకరించారు. ప్రత్యేక అభిషేకాలు చేశారు. మధ్యాహ్నం అన్నదానం చేశారు. రాత్రి శ్రీవారికి అత్యంత ప్రియమైన బంగారు గరుడ వాహనంపై ఉత్సవ విగ్రహాన్ని కొలువుదీర్చి ఊరేగించారు.
ట్రాక్ దాటుతుండగా..


