సోమిరెడ్డీ.. దళితులపైనా నీ దాష్టీకాలు | - | Sakshi
Sakshi News home page

సోమిరెడ్డీ.. దళితులపైనా నీ దాష్టీకాలు

Nov 15 2025 6:51 AM | Updated on Nov 15 2025 6:51 AM

సోమిరెడ్డీ.. దళితులపైనా నీ దాష్టీకాలు

సోమిరెడ్డీ.. దళితులపైనా నీ దాష్టీకాలు

వేరే సామాజిక వర్గాలను

టచ్‌ చేసే దమ్ముందా?

నిన్ను ప్రశ్నిస్తే గొంతులు కోస్తావా..

ఇళ్లు కూల్చేస్తావా?

వైఎస్సార్‌సీపీ ఉమ్మడి జిల్లా

అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్‌రెడ్డి

తోటపల్లిగూడూరు: అధికార మదంతో సోమిరెడ్డి మనిషిననే విచక్షణ మరిచి రాక్షసంగా ప్రవర్తిస్తున్నాడని, దళితులు, గిరిజనులపైనా నీ దాష్టీకాలా? అంటూ మాజీమంత్రి, వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్‌రెడ్డి మండిపడ్డారు. సర్వేపల్లి నియెజకవర్గం ఏమైనా ఆఫ్ఘానిస్తాన్‌, పాకిస్తాన్‌లో ఉందా? అని ప్రశ్నించారు. మండలంలోని తోటపల్లి పంచాయతీ డక్కులవారిపాళెంలో వైఎస్సార్‌సీపీ సానుభూతిపరుడు మీదూరు శీనయ్య పక్కా గృహాన్ని ఇటీవల అధికారులు టీడీపీ తొత్తులుగా మారి అన్యాయంగా కూల్చివేసిన విషయం విదితమే. ఈ క్రమంలో శుక్రవారం కాకాణి గ్రామానికి చేరుకొని కూల్చివేసిన పక్కా గృహాన్ని పరిశీలించి, బాధితులతో మాట్లాడి ధైర్యాన్ని చెప్పారు. కాకాణి మాట్లాడుతూ సోమిరెడ్డి చెప్పాడని సర్వే పేరుతో అధికారులు దళితుడి ఇంటిని అన్యాయం కూల్చి వేశారన్నారు. కఠిక పేదరికంలో ఉన్న మీదూరు శీనయ్య ఇంటిని కూల్చడానికి సోమిరెడ్డికి, అధికారులకు ఎలా మనస్సు వచ్చిందో అర్థం కావట్లేదన్నారు. రూపాయి రూపాయి కూడబెట్టుకొని, కష్టపడి కట్టుకొన్న ఇంటిని కూల్చివేయడంతో ఆ దళిత కుటుంబ పడుతున్న బాధను చూస్తే ఎవరికై నా కళ్ల వెంట నీళ్లు తెప్పిస్తాయన్నారు. 2015లో చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడే గ్రామ కంఠం భూములు గ్రామస్తుల ఆధీనంలో ఉంటే రెగ్యులరైజ్‌ చేయొచ్చని ఉత్తర్వులిచ్చారన్నారు. అయితే డక్కులవారిపాళెంలో మాత్రం స్థానిక పంచాచతీ కార్యదర్శి ఎటువంటి నియమ నిబంధనలు పాటించకుండా, రికార్డులను తారుమారు చేసి ఓ పేద దళిత కుటుంబ ఉసురు పోసుకొన్నాడని మండిపడ్డారు. అన్యాయంగా ఇంటిని కోల్పోయిన దళిత కుటుంబానికి నష్ట పరిహారం అందించేలా న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామన్నారు. ఈ దాష్టీకానికి పాల్పడిన అధికారితోనే నష్టపరిహారం ఇచ్చేలా చర్యలు ఉంటాయన్నారు. సోమిరెడ్డి మాటలు విని రెచ్చిపోతున్న అధికారులు రేపటి రోజు జీవిత కాలం క్షోభకు గురై బాధపడే రోజులు వస్తాయని గుర్తించుకోవాలని కాకాణి స్పష్టం చేశారు.

ప్రశ్నిస్తే ఇలా కక్ష సాధింపా

సర్వేపల్లి నియోజకవర్గంలో ఇలాంటి అకృత్యాలు సర్వ సాధరణమయ్యాయన్నారు. తనకు వ్యతిరేకంగా ఉన్న దళితుల ఇళ్లను కూల్చడం, ప్రశ్నించిన గిరిజనుల ఇళ్లకు వెళ్లి గొంతులను కోయడం వంటి దుర్మార్గపు చర్యలకు సోమిరెడ్డి తెర లేపారన్నారు. కాకుటూరులో శివాలయ భూములను లేఅవుట్ల యజమానులకు అమ్ముకోవడం, పొదలకూరులో ప్రైవేట్‌ భూముల్లో టేకు చెట్లను నరికి సొమ్ము చేసుకోవడం సోమిరెడ్డికే చెల్లిందన్నారు. ప్రభుత్వరంగ జెన్‌ సంస్థపై దాడులు చేయడం, బూడిద తరలించే బల్కర్ల నుంచి రౌడీ మామూళ్లు వసూలు సోమిరెడ్డి అలవాటైందన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి చిల్లకూరు సుధీర్‌రెడ్డి, జిల్లా సంయుక్త కార్యదర్శి ఇసనాక రమేష్‌రెడ్డి, పార్టీ మండల అధ్యక్షుడు ఉప్పల శంకరయ్యగౌడ్‌, జెడ్పీటీసీ సభ్యులు ఎంబేటి శేషమ్మ, పార్టీ నాయకులు ఈదూరు రామాచార్యులు, టంగుటూరు పద్మనాభరెడ్డి, మన్నెం చిరంజీవులగౌడ్‌, మన్నెం సుబ్రహ్మణ్యం గౌడ్‌, తలమంచి సురేంద్రబాబు, ఒబ్బారెడ్డి సురేష్‌రెడ్డి, చిల్లకూరు ప్రవీణ్‌రెడ్డి, ప్రకాశ్‌రెడ్డి, తిరవళ్లూరు ఈశ్వరయ్య, తానే తిరుపతయ్య, ఎంబేటి సంధ్యారాణి, దుంపల ఏసోబు, అన్నం హరిబాబు, ఎంబేటి వీరరాఘవులు, దారా హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement