పురుగుల బియ్యంతో విద్యార్థులకు భోజనం
● పరిశీలించిన ఎంఈఓ
వరికుంటపాడు: పేదింటి బిడ్డలు చదువుకునే స్కూళ్లను కూటమి ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. మధ్యాహ్న భోజన పథకం అమలులో నిర్లక్ష్యం కనిపిస్తోంది. మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పురుగులు పట్టిన బియ్యంతో మధ్యాహ్న భోజనం వడ్డిస్తున్నట్లు సోషల్ మీడియాలో వైరలైంది. దీంతో ఎంఈఓ రమణయ్య శుక్రవారం స్కూల్‌కి వెళ్లి పరిశీలించారు. ఆ బియ్యాన్ని పక్కన పెట్టామని, వండలేదని చెప్పారు. మరో స్కూల్ నుంచి బియ్యం తెప్పించి భోజనం తయారు చేయించామన్నారు. కాగా పిల్లలు మాత్రం పురుగులు పట్టిన బియ్యంతో పలుమార్లు అన్నం తయారు చేసి పెట్టారని చెబుతున్నారు. వంటశాల సమీపంలో బియ్యం శుభ్రం చేసే చోటు అధ్వానంగా ఉంది. సర్పంచ్ దిలీప్, తల్లిదండ్రులు పాఠశాలకు వెళ్లి భోజనాన్ని పరిశీలించారు.


