అవినీతి మత్తులో జోగుతున్న రెవెన్యూ విభాగం
నెల్లూరు (బారకాసు): నెల్లూరు కార్పొరేషన్‌కు పన్ను వసూళ్లు మందగించడంతో ఖజానా ఖాళీ అవుతోంది. ఇతర నిధులు విడుదల కాకపోతే.. ఇబ్బందులు చుట్టుముట్టే ప్రమాదమూ లేకపోలేదు. ఆస్తి పన్ను విధింపులో పలు అక్రమాలు.. వేయాల్సిన దాని కంటే తక్కువగా విధించడం.. కొత్తగా వేయాల్సిన అంశాలను రెవెన్యూ విభాగం విస్మరిస్తోంది. లోసుగులను ఉపయోగించుకొని ఆదాయానికి ఆ శాఖకు చెందిన కొందరు అధికారులు, సిబ్బంది భారీగా గండికొడుతున్నారు.
కార్యాలయానికెళ్తే చకచకా..
ఇళ్లు, భవనాలకు ఆస్తి పన్ను విధించే విషయంలో అవినీతి, అక్రమాలకు అంతే ఉండటం లేదు. కొత్తగా పన్ను విధించాలంటే కార్యాలయానికి వెళ్లి ప్రజలు కలిస్తే దరఖాస్తులు ముందుకు కదులుతున్నాయి. అదే ఆన్‌లైన్లో అప్లయ్ చేస్తే ఏదో ఒక తరహాలో కొర్రీలేస్తున్నారు. దరఖాస్తుదారులు కలిశాక లంచం డిమాండ్ చేయడం.. లేని పక్షంలో ఫైళ్లను పక్కనబెడుతున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పన్నులకు సంబంధించిన దరఖాస్తుల పరిశీలన విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించారనే కారణంతో 71 మంది అడ్మిన్ సెక్రటరీలకు షోకాజ్ నోటీసులను జారీ చేయాలని కమిషనర్ నందన్ ఇటీవల ఆదేశించారు.
విభాగాలు అసెస్మెంట్లు రావాల్సింది వసూలైంది
(రూ.కోట్లల్లో) (రూ.కోట్లల్లో)
ప్రైవేట్ 1,36,700 127.66 47
కేంద్ర ప్రభుత్వ 41 2.41 0.02
రాష్ట్ర ప్రభుత్వ 400 13.27 0.98
ఖాళీ స్థలాలు 6844 20.70 4.7
కుళాయిలు 45,634 64.59 5.86
లక్ష్య సాధనలో
అంతులేని నిర్లక్ష్యం
దరఖాస్తుల పరిష్కారంలో
తీవ్ర జాప్యం
పెంపు పేరిట అక్రమ వసూళ్లు
కార్పొరేషన్ ఆదాయానికి గండి
నూరు శాతం సాధించడమే లక్ష్యం
పన్నుల వసూళ్లపై ప్రత్యేక దృష్టి సారించాం. ఇప్పటి వరకు 32 శాతం మేరే వసూలు చేశాం. మిగిలిన మొత్తాన్ని సాధించేలా యత్నిస్తున్నాం. ఆర్వోలు, ఆర్‌ఐలు, అమెనిటీస్ సెక్రటరీల్లో ఎవరైనా నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవు. విధుల్లో అలక్ష్యం చూపిన 71 మంది అమెనిటీస్ సెక్రటరీలకు షోకాజ్ నోటీసులను జారీ చేశాం. లక్ష్యాలను సాధించకపోతే చర్యలకు వెనుకాడబోం. – నందన్, కమిషనర్, నెల్లూరు నగరపాలక సంస్థ


