ప్రజలకు ఇబ్బందుల్లేకుండా చర్యలు
నెల్లూరు సిటీ: రూరల్ నియోజకవర్గంలోని బుజబుజనెల్లూరు హైవే జంక్షన్ వద్ద వరదనీటిని తొలగించి, ప్రజలకు ఇబ్బంది లేకుండా అధికారులు చర్యలు చేపట్టారు. రూరల్ పరిధిలోని పలు ప్రాంతాల్లో కలెక్టర్ హిమాన్షు శుక్లా, ఎస్పీ అజిత, కార్పొరేషన్ కమిషనర్ వై.నందన్, టీడీపీ నేత కోటంరెడ్డి గిరిధర్‌రెడ్డి పర్యటించారు. 25వ డివిజన్‌లో జరుగుతున్న కాలువ పూడికతీత పనులను గిరిధర్‌రెడ్డి మంగళవారం అధికారులతో కలిసి పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ తుపాను నేపథ్యంలో అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని తెలిపారు. ప్రజలకు ఎటువంటి సమస్య ఉన్నా తమ దృష్టికి తీసుకొస్తే పరిష్కరిస్తామన్నారు. కార్యక్రమంలో రూరల్ ఎమ్మెల్యే కార్యాలయ ఇన్‌చార్జి దాట్ల చక్రవర్ధన్‌రెడ్డి, 25వ డివిజన్ కార్పొరేటర్ బద్దెపూడి నరసింహగిరి తదితరులు పాల్గొన్నారు.


