ఐఈఆర్పీల సర్టిఫికెట్ల వెరిఫికేషన్
నెల్లూరు(టౌన్): ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని భవిత కేంద్రాల్లో విధులు నిర్వహిస్తున్న ఐఈఆర్పీ లు సర్టిఫికెట్ వెరిఫికేషన్ కార్యక్రమాన్ని నెల్లూరులోని సమగ్ర శిక్ష కార్యాలయంలో సోమవారం నిర్వహించారు. త్రిసభ్య కమిటీ ఆధ్వర్యంలో విజువల్ ఇంపైర్/హియరింగ్ ఇంపైర్ విభాగంలో పనిచేస్తున్న 43 మంది సర్టిఫికెట్లను పరిశీలించారు. మంగళవారం ఎంఆర్ విభాగంలో పనిచేస్తున్న వారు వెరిఫికేషన్ చేయింకోవాల్సి ఉంటుంది. కార్యక్రమంలో కమిటీ అధికారులు డిప్యూటీ డీఈఓ వెంకటేశ్వరనాయక్, ఎంఈఓ జయరామనాయుడు, హెచ్‌ఎం రియాజ్ అహ్మద్, సమగ్రశిక్ష సహిత విద్య కో–ఆర్డినేటర్లు పొట్లూరు ప్రసాద్, చంద్రశేఖరరెడ్డి పాల్గొన్నారు.


