చేనేత కార్మికులకు తిప్పలు
నెల్లూరు సిటీ: వర్షం కారణంగా చేనేత కార్మికులు ఇబ్బందులు పడుతున్నారు. నెల్లూరు రూరల్ మండలం సౌత్‌మోపూరు గ్రామంలోని బీసీకాలనీ, ములుమూడి, నారాయణరెడ్డిపేటలో దాదాపు 600 చేనేత కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయి. మంగళవారం ఎడతెరపి లేకుండా కురిసిన వర్షంతో చాలామంది కార్మి కుల మగ్గం గుంతల్లోకి నీరు చేరింది. దీంతో తీవ్ర ఇబ్బందులు పడ్డారు. నష్టపోయిన కార్మికులను ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని చేనేత కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు పముజుల హరి డిమాండ్ చేశారు.
సౌత్‌మోపూరు బీసీకాలనీలో మగ్గం
గుంతలో నీళ్లు తొలగిస్తూ..


