
పత్రికా స్వేచ్ఛను హరించడమే
ప్రజాస్వామ్యానికి విఘాతం
అక్రమ కేసులతో అణచివేయలేరు
కక్ష సాధింపు చర్యలు తగవు
తప్పులు సరిదిద్దుకోలేకనే వేధింపులు
‘సాక్షి’పై కక్ష కట్టి పోలీసు కేసులను నమోదు చేసి పత్రికా స్వేచ్ఛను హరిస్తున్నారు. ‘సాక్షి’ ఎడిటర్ ధనంజయరెడ్డి, నెల్లూరు బ్యూరో ఇన్‌చార్జి మస్తాన్‌రెడ్డిపై అక్రమ కేసులు పెట్టడం జర్నలిస్టుల గొంతు నొక్కడమే. నచ్చని వార్తలు పత్రికల్లో ప్రచురితమైతే న్యాయపరంగా ఎదుర్కోవాలే కాని ఇలా కేసులు నమోదు చేసి వేధించడం ప్రజాస్వామ్యంలో మంచి పద్ధతి కాదు.
– పెదమల్లు రమణారెడ్డి, వైఎస్సార్‌సీపీ మండల కన్వీనర్,
సీనియర్ నాయకుడు, పొదలకూరు
పత్రికలపై దాడులకు పాల్పడడం, కేసులు నమోదు చేయడం ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగించడమే అవుతుంది. ‘సాక్షి’ పత్రిక ప్రజల పక్షాన నిలబడి ప్రభుత్వం చేస్తున్న ప్రజావ్యతిరేక పాలనను బహిర్గతం చేస్తుందన్న అక్కసుతోనే ఎడిటర్ ధనంజయరెడ్డిపై వరుస కేసులు నమోదు చేయిస్తున్నారు. గతంలో ఎప్పుడూ ఇలాంటి ఘటనలు చూడలేదు.
– గోగిరెడ్డి గోపాల్‌రెడ్డి, సీనియర్ నాయకుడు, వైఎస్సార్‌సీపీ, మహ్మదాపురం, పొదలకూరు మండలం
ప్రభుత్వానికి, ప్రజలకు వారధిలా వ్యవహరించే పత్రికా రంగం ప్రజాస్వామ్యంలోని నాలుగు స్తంభాల్లో ఒకటి. అలాంటి పత్రికా రంగాన్ని అణచివేసే ధోరణిలో వార్తలు రాసే విలేకరులు, ఎడిటర్లపై పోలీసులు బెదిరింపు ధోరణిలో వ్యవహరించడం సరికాదు. రాష్ట్రంలో ‘సాక్షి’ పత్రికపై ప్రభుత్వం అక్రమ కేసులతో కక్ష సాధింపు ధోరణిలో వ్యవహరిస్తోంది.
– డాక్టర్ సీహెచ్ ఆదిశేషయ్య, జిల్లా వైఎస్సార్‌సీపీ ఉపాధ్యక్షుడు
జర్నలిస్టులు రాజకీయాలకు, పార్టీలకు అతీతంగా సమస్యలను వెలుగులోకి తెస్తారు. ‘సాక్షి’ పత్రికలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా వార్తలు రాశారనే కోణంతో ఆ పత్రికను ప్రభుత్వం టార్గెట్ చేసింది. అందులో పనిచేసే జర్నలిస్టులపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడడం మంచి పద్ధతి కాదు. ఈ విధానాన్ని ప్రభుత్వం మార్చుకోవాలి.
– వి.నరసింహులు, జేఏసీ
అధికార పార్టీ నేతలు చేస్తున్న తప్పులను సరిదిద్దుకోలేని ప్రభుత్వం ‘సాక్షి’ జర్నలిస్టులపై దాడులు చేస్తోంది. అర్ధరాత్రి పూట మహిళలని చూడకుండా ‘సాక్షి’ బ్యూరో ఇంటికి పోలీసులను పంపి నోటీసులు ఇవ్వడం దారుణం. సమస్యలను పక్కదారి పట్టించేందుకు ప్రభు త్వం ఇలాంటి సంస్కృతికి తెరతీయడం దుర్మార్గం. నోటీసులు, విచారణ, కేసుల పేరుతో వేధిస్తే ప్రజలే ప్రభుత్వానికి తగిన గుణపాఠం నేర్పుతారు.
– సాగర్‌రెడ్డి, జేఏసీ

పత్రికా స్వేచ్ఛను హరించడమే

పత్రికా స్వేచ్ఛను హరించడమే

పత్రికా స్వేచ్ఛను హరించడమే

పత్రికా స్వేచ్ఛను హరించడమే

పత్రికా స్వేచ్ఛను హరించడమే