
రోడ్డుపై విరిగిపడిన కొండచరియలు
సంగం: సంగంలో శనివారం రాత్రి కురిసిన భారీ వర్షానికి కొండ వద్ద ఉన్న నెల్లూరు– ముంబై జాతీయ రహదారిపై కొండచరియలు విరిగిపడ్డాయి. సమాచారం అందుకున్న ఎస్సై రాజేష్ అర్ధరాత్రి వెంటనే స్పందించిన తన సిబ్బందితో కలిసి రహదారిపై పడిన కొండ చరియలను తొలగించి ట్రాఫిక్ అంతరాయం లేకుండా చర్యలు తీసుకున్నారు. ఎస్సై రాజేష్ మాట్లాడుతూ వాహనదారులు కొండ వద్ద జాతీయ రహదారిపై ప్రయాణం చేసే సమయంలో జాగ్రత్తలు పాటించాలని సూచించారు. వర్షాలు పడుతున్న నేపథ్యంలో కొండపై ఉన్న రాళ్లు విరిగిపడే ప్రమాదం ఉన్నందున రాత్రి సమయాల్లో వాహనదారులు మరెంతో జాగ్రత్తలు పాటించాలని, కొండ వద్ద వాహన వేగం తగ్గించి వెళ్లాలని సూచించారు. ఏమైనా ఇబ్బందులు ఉన్న సమయంలో వాహనదారులు వెంటనే 112 నంబర్‌కు కానీ తమకు కానీ ఫోన్ చేస్తే స్పందించి అక్కడికి చేరుకుని సహాయం చేస్తామని తెలియజేశారు.