
దివ్య దీపావళి శుభాకాంక్షలు
నెల్లూరు(స్టోన్‌హౌస్‌పేట): చీకటిపై వెలుగు సాధించిన విజయంగా దీపావళి పర్వదినాన్ని లక్ష్మీదేవి దివ్య ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో జరుపుకోవాలని మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్‌రెడ్డి ఆకాంక్షించారు. ప్రజలందరికి దీపావళి శుభా కాంక్షలు తెలిపారు. అజ్ఞాన చీకట్లను పారద్రోలి మన జీవితంలో వెలుగులు నింపే దీపావళిని ఆనందంగా, జాగ్రత్తగా జరుపుకోవాలని కోరారు.
వెలుగుల పండగ కావాలి
అందరి జీవితాల్లో ఆనందం వెల్లివిరియాలని, వెలుగు పండగ దీపావళి అందరిలో సంతోషాలు వెల్లివిరియాలని ఎమ్మెల్సీ సంప్రదాయబద్ధంగా జరుపుకోవాలని, ప్రజలు జాగ్రత్తలు తీసుకుంటూ కుటుంబసభ్యులతో కలిసి సురక్షితంగా పండగ జరుపుకోవాలని ఆకాంక్షిస్తున్నామన్నారు.
పర్యావరణహితంగా
దీపావళి జరుపుకోవాలి
నెల్లూరురూరల్: జిల్లా ప్రజలందరూ పర్యావరణ హితంగా జరుపుకోవాలని కలెక్టర్ హిమాన్షు శుక్లా ఒక ప్రకటనలో కోరారు. పెద్దపెద్ద శబ్దాలు, కాలుష్యం వెదజల్లే టపాసులు కాకుండా వెలుగుదివ్వెలు విరజిమ్మే టపాసులు కాల్చాలన్నారు. తల్లిదండ్రులు, పెద్దల సమక్షంలోనే పిల్లలు టపాసులు కాల్చేలా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
జేసీ శుభాకాంక్షలు
జిల్లా ప్రజలు ఇంటిల్లిపాది ఆనందోత్సాహాలు, వెలుగుదివ్వెల కాంతులతో పండగను ఆనందంగా జరుపుకోవాలని జేసీ మొగిలి వెంకటేశ్వర్లు ఆకాంక్షించారు. ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. అంధకారంపై వెలుగు సాధించిన పండగ దీపావళి స్ఫూర్తితో నిర్వహించాలని కోరారు.
నేడు పీజీఆర్‌ఎస్ రద్దు
నెల్లూరు (క్రైమ్): జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం జరిగే ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్) దీపావళి పండగ సందర్భంగా రద్దు చేసినట్లు ఎస్పీ అజిత వేజెండ్ల ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా ప్రజలు ఈ విషయాన్ని గమనించాలని కోరారు.

దివ్య దీపావళి శుభాకాంక్షలు