
జల్లాకు భారీ వర్ష సూచన
నెల్లూరురూరల్: ఆగ్నేయ బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉందని, మంగళవారం నాటికి అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని, దీని ప్రభావంగా జిల్లాకు భారీ వర్ష సూచన ఉందని జిల్లాలోని ప్రజలు, మత్స్య కా రులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ హిమాన్షు శుక్లా ఆదివారం తెలిపారు. ఈ అల్పపీడనం 48 గంటల్లో పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ దక్షిణ మధ్య బంగాళాఖాతం, పశ్చి మ మధ్య బంగాళాఖాతం ప్రాంతాల్లో వాయుగుండంగా బలపడే అవకాశం ఉందన్నారు. బుధవారం నుంచి జిల్లాలో వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. ఈ నెల 23 నుంచి 25వ తేదీ వరకు భారీ వర్షాల ప్రభావం అధికంగా ఉంటుందని, ఈ ప్రభావంతో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.
మత్స్యకారులు వేటకు వెళ్లొదు
అక్టోబర్ 21వ తేదీ మధ్యాహ్నం నుంచి దక్షిణ మధ్య బంగాళాఖాతంలోకి సముద్రయాత్రలు చేయొద్దని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసినట్లు కలెక్టర్ తెలిపారు. మత్స్యకారులు సము ద్రంలోకి వెళ్లకూడదని, సముద్రంలోకి వేటకు వెళ్లిన మత్స్యకారులు తప్పనిసరిగా అక్టోబర్ 21వ తేదీ లోపు తీరానికి చేరుకోవాలన్నారు.
ముందుస్తు జాగ్రత్తలు పాటించాలి
ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసేప్పుడు ప్రజలు చెట్ల కింద నిలబడరాదని, అప్రమత్తంగా ఉండాలని సూచించారు. తీర ప్రాంతాల్లో గాలి వేగం గంటకు 4,565 కి.మీ. వరకు ఉండొచ్చన్నారు. తీర ప్రాంత గ్రామాల ప్రజలు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ప్రజలకు అవసరమైన సహాయ సహకారాలు అందించేందుకు జిల్లా యంత్రాంగం సంసిద్ధంగా ఉందని కలెక్టర్ చెప్పారు. ప్రజలు అప్రమత్తంగా ఉండి, జిల్లా అధికారుల సూచనలను పాటించాలని కలెక్టర్ సూచించారు.
49.1 మి.మీ. సగటు వర్షపాతం
నెల్లూరు(అర్బన్): ఈశాన్య రుతుపవనాల ప్రారంభంలోనే జిల్లా వ్యాప్తంగా నాలుగు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఆదివారం ఉదయానికి జిల్లాలో సగటున 49.1 మి.మీ. వర్షపాతం నమోదైంది. అత్యధికంగా సంగంలో 140.6 మి.మీ., అత్యల్పంగా సైదాపురంలో 1.4 మి.మీ. వర్షం కురిసింది. కోవూరులో 96.2, నెల్లూరు అర్బన్ 93.4, బోగోలు 93.2, నెల్లూరు రూరల్ 90.4, ఆత్మకూరు 82.2, కలువాయి 80.4, బుచ్చిరెడ్డిపాళెం 80.2, చేజర్ల 68.2, ఏఎస్‌పేట 65.2, ఇందుకూరుపేట 64.8, గుడ్లూరు 62.4, తోటపల్లిగూడూరు 61.8, మర్రిపాడు 58.4, కావలి 55.6, కలిగిరి 47.0, అల్లూరు 45.8, కొండాపురం 45.6, పొదలకూరు 45.4, జలదంకి 43.6, దగదర్తి 43.2, కొడవలూరు 42.4, లింగసముద్రం 42.2, ఉలవపాడు 41.4, వింజమూరు 40.6, దుత్తలూరు 37.4, ముత్తుకూరు 36.4, అనంతసాగరం 33.8, విడవలూరు 32.6, వెంకటాచలం 21.2, ఉదయగిరి 20.4, వలేటివారిపాళెం 16.8, సీతారామపురం 11.8, కందుకూరు 11.2, రాపూరు 5.8, మనుబోలు 3.6, వరికుంటపాడులో 3.4 మి.మీ. వర్షం కురిసింది.
రెండు రోజుల్లో ఆగ్నేయ
బంగాళాఖాతంలో అల్పపీడనం
ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి
మత్స్యకారులు ఎవరూ వేటకు వెళ్లొద్దు
కలెక్టర్ హిమాన్షు శుక్లా