
ఇద్దరికి ప్రాణం పోసి..
ఇందుకూరుపేట: బ్రెయిన్ డెడ్‌కు గురై తిరిగి రాని లోకాలకు వెళ్లి కుటుంబాన్ని శోక సముద్రంలో నింపిన ఆయన ఇద్దరు జీవితాల్లో వెలుగునింపి సజీవంగా నిలిచారు. మరణానంతరం మానవత్వానికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచాడు. ఇందుకూరుపేటకు చెందిన మాచవరం మల్లికార్జున (53) టైల్స్ పని చేసుకొంటూ జీవనం సాగించేవాడు. భార్య అమరావతి ఇంట్లోనే ఉంటుంది. పెద్ద కొడుకు కార్తీక్, ఎంసీఏ (ఎస్వీ యూనివర్సిటీ, తిరుపతి) మొదటి సంవత్సరం చదువుతుండగా, చిన్నకొడుకు వివేక్ ఐటీఐ పూర్తి చేసి నెల్లూరులో కారు మెకానిక్ పని నేర్చుకొంటున్నాడు. పేద కుటుంబం అయిన మల్లికార్జున ఉన్న దాంట్లో బిడ్డలను చదివించుకొంటూ బతుకీడుస్తున్నాడు. ఈ నెల 12న నిద్ర లేచే సరికే కాళ్లు చేతులు సరిగా కదిలించలేకపోవడంతో కుటుంబ సభ్యులు నెల్లూరులోని పీపీసీకి తరలించారు. అక్కడ ఒక రోజు పాటు వైద్యం అందించి బ్రెయిన్ స్ట్రోక్ అని పరిస్థితి ఇబ్బందికరంగా ఉందని చెప్పడంతో హుటాహుటిన కిమ్స్ వైద్యశాలకు తీసుకెళ్లారు. పరిశీలించిన వైద్యులు మల్లికార్జునకు సీవీఏ ఇస్కిమిక్ స్ట్రోక్, ఎడమ వైపు ఉన్న మిడిల్ సెరిబ్రల్ అర్జరీ (ఎంసీఏ)లో పెద్ద స్ట్రోక్, పెరిగిన ఇంట్రాక్రానియల్ ప్రెజర్ లేదా పుర్రె లోపల ఒత్తిడి పెరగడం, మెదడు ఽమధ్య రేఖ నుంచి పక్కకు జరగడం, ఎడమ వైపు డీకంప్రెనిసివ్ క్రానియోటమీ, అధిక రక్తపోటు ఉన్నట్లు కుటుంబ సభ్యులకు తెలియజేశారు. అయినా చివరి ఆశగా కుటుంబ సభ్యులు సర్జీరీ చేయాలని కోరారు. దీంతో డాక్టర్ ఉదయ్‌కిరణ్ సర్జరీ చేశారు. అనంతరం అబ్జర్వేషన్‌లో ఉన్న సమయంలో బ్రెయిన్ డెడ్‌గా నిర్ధారించారు. వైద్య బృందం అవయవదాన ప్రాముఖ్యతను కుటుంబ సభ్యులకు తెలియజేశారు. దీంతో వారు మనస్ఫూర్తిగా అంగీకరించడంతో విషయాన్ని జీవన్‌దాస్ సంస్థకు తెలియజేశారు. ప్రోటోకాల్ ప్రకారం అవయవాల కేటాయింపునకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. జీవన్‌దాస్ సంస్థ అవయవాలను కర్నూల్‌లోని హాస్పటిల్‌కు లివర్, ఒక కిడ్నీని నెల్లూరులోని హాస్పిటల్‌కు తరలించారు. మరణించిన పలువురు జీవితాల్లో వెలుగును నింపిని మల్లికార్జున మృతదేహానికి కిమ్స్ వైద్యశాల వైద్య బృందం, సిబ్బంది ఘనంగా వీడ్కొలు పలికారు. మృతదేహం స్వగ్రామం ఇందుకూరుపేటకు చేరడంతో పలువురు ఆయన మృతదేహానికి నివాళులర్పించారు. మల్లికార్జున అవయువాలను దానం చేసేందుకు ముందుకు వచ్చిన కుటుంబ సభ్యులను మండల వాసులు, జిల్లా వాసులు అభినందించారు.
బ్రెయిన్ డెడ్‌తో మల్లికార్జున మృతి
అవయవదానంతో రెండు
కుటుంబాల్లో ఆనందం
మరణాంతరం మానవత్వానికి
మల్లికార్జున నిలువెత్తు నిదర్శనం

ఇద్దరికి ప్రాణం పోసి..

ఇద్దరికి ప్రాణం పోసి..