
ప్రసన్న సంఘీభావం
కోవూరు: కల్తీ మద్యంపై ‘సాక్షి’ దినపత్రికలో కథనం ప్రచురితమైన నేపథ్యంలో నమోదైన కేసుల్లో నోటీసులు అందుకుని పోలీసుల విచారణకు హాజరైన నెల్లూరు బ్యూరో ఇన్‌చార్జి, ఏపీయూడబ్ల్యూజే జిల్లా ప్రధాన కార్యదర్శి చిలకా మస్తాన్‌రెడ్డిని ఆయన నివాసంలో బుధవారం మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ పీఏసీ సభ్యుడు నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి కలిసి సంఘీభావం తెలిపారు. ఆయన మాట్లాడుతూ ప్రజల సమస్యలు వెలుగులోకి తీసుకొచ్చేందుకు పాత్రికేయులు కృషి చేస్తారన్నారు. వారిపై ఒత్తిళ్లు, కేసులు నమోదు చేయడం తగదని అభిప్రాయపడ్డారు. ఎల్లప్పుడూ ‘సాక్షి’ ప్రజల పక్షాన, వారికి అండగా నిలబడుతుందని స్పష్టం చేశారు. ప్రసన్న వెంట సీనియర్ నాయకుడు కలువ బాలశంకర్‌రెడ్డి, అనుబంధ సంఘాల నాయకుడు చేజర్ల సుధాకర్‌రెడ్డి ఉన్నారు.