
స్కాన్ చేశాకే విక్రయించాలి
● ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ డీసీ శంకరయ్య
నెల్లూరు(క్రైమ్): బార్, మద్యం దుకాణాల యజమానులు ఏపీ ఎకై ్సజ్ సురక్ష యాప్ ద్వారా బాటిళ్లను స్కాన్ చేసిన అనంతరమే విక్రయించాలని ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ డిప్యూటీ కమిషనర్ శంకరయ్య తెలిపారు. బుధవారం ఎకై ్సజ్ నెల్లూరు – 1 స్టేషన్‌లో నగరంలోని బార్లు, మద్యం దుకాణాల యజమానులతో ఆయన సమావేశం నిర్వహించి యాప్ పనితీరుపై అవగాహన కల్పించారు. స్కాన్ చేయకుండా ఎట్టి పరిస్థితుల్లోనూ మద్యం విక్రయించరాదని స్పష్టం చేశారు. బెల్టు షాపులు నిర్వహించడం, ప్రోత్సహించడం చట్టరీత్యా నేరమన్నారు. అలాంటి చర్యలు గుర్తిస్తే లైసెన్సు రద్దు చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అనంతరం నగరంలోని లక్కీ వైన్ షాపులో యాప్ వినియోగంను పరిశీలించారు. సమావేశంలో ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ ఏఈఎస్ రమేష్, నెల్లూరు – 1 ఇన్‌స్పెక్టర్ పి.రమేష్‌బాబు, ఎస్సైలు ప్రభాకర్‌రావు, డి.శ్రీధర్, జేకేవీఎన్ మురళీకృష్ణ, సిబ్బంది పాల్గొన్నారు.