
తాడేపల్లికి ఎమ్మెల్సీ పర్వతరెడ్డి, కాకాణి పూజిత
నెల్లూరు (పొగతోట): వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కో ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి బుధవారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో రాష్ట్ర అనుబంధ విభాగాల అధ్యక్షులు, వర్కింగ్ ప్రెసిడెంట్లతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఎమ్మెల్సీ, నెల్లూరు సిటీ ఇన్‌చార్జి పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి, రాష్ట్ర మహిళ విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ కాకాణి పూజిత హాజరయ్యారు.
కిలో సగటు పొగాకు రూ.146.97
మర్రిపాడు: మండలంలోని డీసీపల్లి పొగాకు బోర్డు వేలం కేంద్రంలో కిలో సగటు పొగాకు ధర రూ.146.97గా నమోదైంది. బుధవారం 622 పొగాకు బేళ్లను విక్రయించినట్లు వేలం నిర్వహణాధికారి రాజశేఖర్ తెలిపారు. వేలానికి 975 బేళ్లు రాగా 622 బేళ్లను విక్రయించామని, మిగిలిన బేళ్లను వివిధ కారణాలతో తిరస్కరించినట్లు తెలిపారు. వేలంలో 72981.8 కిలోల పొగాకును విక్రయించగా రూ.10726174 వ్యాపారం జరిగింది. కిలోకు గరిష్టంగా రూ.315, కనిష్టంగా ధర రూ.65 లభించింది. వేలంలో 10 కంపెనీల వ్యాపార ప్రతినిధులు పాల్గొన్నారు.

తాడేపల్లికి ఎమ్మెల్సీ పర్వతరెడ్డి, కాకాణి పూజిత