
కృష్ణపట్నం పోర్టుకు ‘రైజింగ్ స్టార్’ అవార్డు
ముత్తుకూరు (పొదలకూరు): క్వాలిటీ సర్కిల్ ఫోరం ఆఫ్ ఇండియా తిరుపతిలో బుధవారం నిర్వహించిన 11వ సదస్సులో అదానీ కృష్ణపట్నం పోర్టు లిమిటెడ్‌కు రైజింగ్ స్టార్ ఆర్గనైజేషన్ అవార్డును బుధవారం ప్రదానం చేసింది. ఆత్మ నిర్భర్ వికాస్ భారత్‌పై నాణ్యమైన భావనలు, వినూత్న పరిష్కారాలను సమర్పించిన పోర్టు మొత్తం 8 జట్లు బంగారు అవార్డులను గెలుచుకున్నట్లు సీఈఓ జగదీష్‌పటేల్ పేర్కొన్నారు. కన్వెన్షన్లో దేశ వ్యాప్తంగా 85 సంస్థలకు చెందిన 300 జట్లు పాల్గొన్నాయి. కృష్ణపట్నం పోర్టు లిమిటెడ్ హెల్త్ సేప్టీ అండ్ ఎన్విరాన్మెంట్, ఇంజినీరింగ్ ఉద్యోగులు ముగ్గురు వ్యక్తిగత అవార్డులు సాధించారు. కౌశల్‌కుమార్ సింగ్‌కు అత్యుత్తమ నాయకత్వం, నాణ్యతపై నిబద్ధత కోసం చాంపియన్ ఆఫ్ ఎక్సలెన్స్ అవార్డు అభించినట్లు వెల్లడించారు. నైపుణ్యంలో మధుసూదనరావుకు స్కిల్ చాంపియన్ అవార్డు, మణికంఠకు మార్గదర్శకత్వానికి ఉత్తమ ఫెసిలిటేటర్ అవార్డు అభించాయి.
నుడా వైస్ చైర్మన్‌గా జేసీ
నెల్లూరురూరల్: నెల్లూరు అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (నుడా) వైస్ చైర్మన్‌గా జాయింట్ కలెక్టర్ ఎం.వెంకటేశ్వర్లును నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో నుడా వైస్ చైర్మన్‌గా అప్పటి నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ సూర్యతేజ (ఐఏఎస్) వ్యవహరించారు. అయితే ఆయన ఆర్నెల్ల క్రితం బదిలీపై వెళ్లడంతో ఆ స్థానంలో ఇప్పటి వరకు ఎవరినీ నియమించలేదు. తాజాగా జాయింట్ కలెక్టర్‌ను నియమించింది.
డీఎస్‌డీఓగా యతిరాజ్ కొనసాగింపు
నెల్లూరు (బృందావనం): జిల్లా క్రీడాభివృద్ధి అధికారిగా ఆర్‌కే యతిరాజ్‌ను కొనసాగిస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర క్రీడాప్రాధికార సంస్థ (శాప్) ద్వారా ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు శాప్ మేనేజింగ్ డైరెక్టర్, వైస్ చైర్మన్ ఎస్.భరణి ఉత్తర్వులు జారీ చేశారు. యతిరాజ్ ఈ నెల 31న ఉద్యోగ విరమణ చేయనున్నారు. ఆయన ఉద్యోగ విరమణ తర్వాత జిల్లా క్రీడాప్రాధికార సంస్థలో ఫుట్‌బాల్ కోచ్‌గా విధులు నిర్వహిస్తున్న పాండు రంగారావును జిల్లా క్రీడాభివృద్ధి అధికారిగా నియామకం చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అయితే జరిగిన పొరపాటును సరిదిద్దుకుంటూ ప్రభుత్వం డీఎస్‌డీఓగా ఎతిరాజ్‌నే నియామకం చేసింది.
అడహాక్ పద్ధతిలో పదోన్నతులు
నెల్లూరు (పొగతోట): జిల్లా పరిషత్, పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ విభాగాల్లో పనిచేస్తున్న సీనియర్ సహాయకులకు అడహాక్ పద్ధతిలో డిప్యూటీ ఎంపీడీఓలుగా పదోన్నతులు కల్పించారు. బుధవారం జెడ్పీ సమావేశ మందిరంలో పదోన్నతులకు సంబంధించిన ప్రక్రియను జెడ్పీ సీఈఓ మోహన్‌రావు, డీపీఓ శ్రీధర్‌రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు.

కృష్ణపట్నం పోర్టుకు ‘రైజింగ్ స్టార్’ అవార్డు

కృష్ణపట్నం పోర్టుకు ‘రైజింగ్ స్టార్’ అవార్డు