
సీనియర్ అసిస్టెంట్‌కు పదోన్నతి
నెల్లూరు రూరల్: జిల్లా సమాచార పౌరసంబంధాల శాఖలో సీనియర్ అసిస్టెంట్‌గా విధులు నిర్వహిస్తున్న గుండాబత్తిన సువర్ణ సూపరింటెండెంట్‌గా పదోన్నతి పొంది ఒంగోలు ప్రాంతీయ కార్యాలయానికి బదిలీ అయ్యారు. బుధవారం నెల్లూరులోని కార్యాలయంలో ఆత్మీయ అభినందన సభను ఆ శాఖ డిప్యూటీ డైరెక్టర్ వేణుగోపాల్‌రెడ్డి అధ్యక్షతన నిర్వహించారు. సువర్ణ సేవలను కొనియాడారు. కార్యక్రమంలో డీఈ శివశంకర్‌రావు, డివిజనల్ పీఆర్వో రవికుమార్, ఏపీఆర్వో రవీంద్రబాబు, సీనియర్ అసిస్టెంట్ ఖాదర్‌మస్తాన్, పీఆర్వో వినోద్‌కుమార్, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.