
కోళ్ల వ్యర్థాల వాహనం సీజ్
పొదలకూరు: తమిళనాడు రాష్ట్రం సేలం నుంచి జిల్లాలోని జొన్నవాడ చేపల చెరువుల వద్దకు కోళ్ల వ్యర్థాలను తరలిస్తున్న మినీ వ్యాన్‌ను పొదలకూరు పోలీసులు మంగళవారం సీజ్ చేశారు. వ్యర్థాలను తరలిస్తున్న మణికంఠపై కేసు నమోదు చేశారు. రెవెన్యూ, మత్స్య, పోలీసు శాఖలు కలిసి వ్యర్థాలను అటవీ ప్రాంతంలో పాతిపెట్టారు.
కండలేరులో
59.880 టీఎంసీలు
రాపూరు: కండలేరు జలాశయంలో మంగళవారం నాటికి 59.880 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు ఈఈ గజేంద్రరెడ్డి తెలిపారు. సోమశిల జలాశయం నుంచి కండలేరుకు 3,400 క్యూసెక్కుల నీరు చేరుతోందన్నారు. కండలేరు నుంచి సత్యసాయి గంగ కాలువకు 1,500, పిన్నేరు కాలువకు 300, లోలెవల్ కాలువకు 40, హైలెవల్ కాలువకు 200, మొదటి బ్రాంచ్ కాలువకు 5 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు వెల్లడించారు.