ధరలు భారీగా తగ్గించారు | - | Sakshi
Sakshi News home page

ధరలు భారీగా తగ్గించారు

Oct 15 2025 6:24 AM | Updated on Oct 15 2025 6:24 AM

ధరలు

ధరలు భారీగా తగ్గించారు

వారం, పదిరోజుల వ్యవధిలో పొగాకు ధరలు బాగా తగ్గించారు. హైగ్రేడ్‌ పొగాకు క్వింటాకు రూ.30 వేలు కూడా ఇవ్వడం లేదు. ఇక లోగ్రేడ్‌ను అసలు కొనుగోలు చేయడం లేదు. దీంతో ఈ ఏడాది భారీగా నష్టాలొచ్చే అవకాశం ఉంది. ధరలు మరింత తగ్గుతాయని చెబుతున్నారు. ఇంకెంత తగ్గిస్తారో అర్థం కావడం లేదు. మొత్తంగా బ్యారన్‌కు రూ.2 లక్షల వరకు కచ్చితంగా నష్టం వస్తుంది.

– నలగర్ల రవి, పొగాకు రైతు, పోలినేనిపాళెం

రైతులను ఆదుకోవాలి

ఈ సంవత్సరం మొదటి నుంచి పొగాకు ధరలు అంతంతమాత్రంగానే ఉన్నాయి. ఇప్పుడు మళ్లీ ధరలు ఒక్కసారిగా తగ్గించారు. ఇలా ఎందుకు చేస్తున్నారో అర్థం కావడం లేదు. పొగాకు బోర్డు వద్ద రైతుల కార్పస్‌ఫండ్‌ రూ.వేల కోట్లు ఉంది. ఆ డబ్బులతో ఇటువంటి కష్టసమయంలో రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి.

– కట్టా హనుమంతరావు, పొగాకు రైతు, వలేటివారిపాళెం

ధరలు భారీగా తగ్గించారు  
1
1/1

ధరలు భారీగా తగ్గించారు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement