
శుభకార్యానికెళ్తూ.. అనంతలోకాలకు
మృతదేహాన్ని పరిశీలిస్తున్న పోలీసులు
నుజ్జునుజ్జయిన కారు
ఆత్మకూరు: కారు నడుపుతూ ఫోన్లో మాట్లాడే క్రమంలో ఏమరుపాటుగా వ్యవహరించడంతో డివైడర్‌ను వాహనం ఢీకొని తాత, మనవరాలు మృతి చెందిన ఘటన మండలంలోని కరటంపాడు సమీపంలో గల నెల్లూరు – ముంబై జాతీయ రహదారిపై శనివారం చోటుచేసుకుంది. ఎస్సై జిలానీ వివరాల మేరకు.. నెల్లూరులోని బీవీనగర్‌కు చెందిన జలసత్రం వేమయ్య (54), తమ సమీప బంధువుల శుభకార్యం నిమిత్తం బద్వేల్‌కు కుమార్తె మొగిలి మౌనిక, మనవరాలు సహస్ర (2), మనవడు యశ్వంత్‌తో కలిసి కారులో బయల్దేరారు. ఈ తరుణంలో ఆత్మకూరు మండలం కరటంపాడు సమీపంలోని గిరిజన కాలనీ వద్ద వేమయ్యకు ఫోన్ రావడంతో మాట్లాడే యత్నంలో ఎదురుగా ట్యాంకర్ వస్తుండటంతో దానికి దారిచ్చే క్రమంలో కారు అదుపుతప్పి డివైడర్‌ను వేగంగా ఢీకొంది. దీంతో డ్రైవింగ్ చేస్తున్న వేమయ్య అక్కడికక్కడే మృతి చెందారు. మౌనిక, చిన్నారి సహస్ర తీవ్రంగా, యశ్వంత్ స్వల్పంగా గాయపడ్డారు. సమీపంలోని గిరిజన కాలనీ వారు ఘటన స్థలానికి చేరుకొని క్షతగాత్రులను 108లో ఆత్మకూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడికెళ్లిన పది నిమిషాలకే సహస్ర మృతి చెందింది. మౌనికకు చికిత్సను అందిస్తున్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.
ఫోన్లో మాట్లాడే క్రమంలో ఏమరుపాటు
డివైడర్‌ను వేగంగా ఢీకొన్న కారు
రోడ్డు ప్రమాదంలో తాత, మనవరాలి మృతి

శుభకార్యానికెళ్తూ.. అనంతలోకాలకు

శుభకార్యానికెళ్తూ.. అనంతలోకాలకు