
కాకాణితో చంద్రశేఖర్‌రెడ్డి భేటీ
నెల్లూరు (స్టోన్‌హౌస్‌పేట): నెల్లూరు పొదలకూరురోడ్డులోని వైఎస్సార్‌సీపీ జిల్లా కార్యాలయంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డితో ఆదివారం ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పార్టీ కార్యక్రమాల కార్యాచరణ, భవిష్యత్ రాజకీయ వ్యవహారాలపై చర్చించారు.
నేడు కలెక్టరేట్‌లో ప్రజా
సమస్యల పరిష్కార వేదిక
నెల్లూరురూరల్: ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించి వాటిని పరిష్కరించే ప్రజా సమస్యల పరిష్కార వేదిక సోమవారం కలెక్టరేట్‌లోని తిక్క న ప్రాంగణంలో నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ హి మాన్షు శుక్లా ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. అర్జీదారులు తమ అర్జీ స్థితి సమాచారం కోసం నేరుగా 1100 కాల్ సెంటర్‌ను సంప్రదించాలని కోరారు. అర్జీదారులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు.
శ్రీవారి దర్శనానికి 24 గంటలు
తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. క్యూ కాంప్లెక్స్‌లో కంపార్ట్‌మెంట్లన్నీ నిండాయి. క్యూలైన్ శిలాతోరణం వద్దకు చేరింది. శనివారం అర్ధరాత్రి వరకు 84,571 మంది స్వామి వారిని దర్శించుకోగా 36, 711 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామి వారికి కానుకల రూపంలో హుండీలో రూ.3.70 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టికెట్లు కలిగిన భక్తులకు సకాలంలోనే దర్శనమవుతోంది. దర్శన టికెట్లు లేని భక్తులకు 24 గంటల్లో దర్శనం లభిస్తోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు కలిగిన భక్తులకు 3 గంటల్లో దర్శనం లభిస్తోంది.