
లారీని అధిగమించే క్రమంలో..
మర్రిపాడు: లారీని అధిగమించే క్రమంలో ఎదురుగా వస్తున్న లారీని కారు ఢీకొనడంతో ఇద్దరు గాయపడిన ఘటన మర్రిపాడు సమీపంలోని నెల్లూరు – ముంబై జాతీయ రహదారిపై చోటుచేసుకుంది. వివరాలు.. కర్ణాటకలోని బెళగావికి చెందిన స్క్రాప్ వ్యాపారులు ఉమర్ ఫరూఖ్, ముజహర్, ఇర్షాద్ నెల్లూరు బయల్దేరారు. మార్గమధ్యలోని కండ్రిక సమీపంలో లారీని కారు ఢీకొనడంతో ఫరూఖ్, ముజహర్ గాయపడ్డారు. హైవే అంబులెన్స్ సిబ్బంది సమయానికి రాలేదు. దీంతో చికిత్స నిమిత్తం క్షతగాత్రులను ఆస్పత్రికి ఆటోలో తరలించారు. కాగా కారుకు సంబంధించిన వస్తువులు రోడ్డుపై పడిపోవడంతో రాకపోకలకు కొద్దిసేపు అంతరాయం ఏర్పడింది. మర్రిపాడు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.