
ఆర్టీసీ బస్సు ఢీకొని..
ఆత్మకూరు: మలుపు తిరిగే క్రమంలో ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో వ్యక్తి గాయపడిన ఘటన పట్టణంలోని ఎమ్జీఆర్ మున్సిపల్ బస్టాండ్ వద్ద చోటుచేసుకుంది. వివరాలు.. ఏఎస్‌పేటకు వెళ్తున్న ఆర్టీసీ బస్సు మలుపు తిరిగే సమయంలో గడ్డం నాగరాజును ఢీకొంది. టైరు కింద ఆయన కాలుపడటంతో నుజ్జునుజ్జయింది. వెంటనే ప్రభుత్వాస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న ఎస్సై జిలానీ ఘటన స్థలాన్ని పరిశీలించారు. నాగరాజు పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స నిమిత్తం నెల్లూరు తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.