
బోల్తాపడిన ప్రైవేట్ బస్సు
కోవూరు: ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తాపడిన ఘటన పట్టణంలోని ఆర్కే పెట్రోల్ బంక్ వద్ద జాతీయ రహదారిపై శనివారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. వివరాలు.. ఒడిశాలోని భువనేశ్వర్ నుంచి బెంగళూరుకు 40 మంది ప్రయాణికులతో నవీన్ ట్రావెల్స్ బస్సు బయల్దేరింది. ఈ తరుణంలో నిద్రమత్తులోకి డ్రైవర్ జారుకోవడంతో వాహనం నియంత్రణ కోల్పోయి రోడ్డు పక్కకు దూసుకెళ్లింది. ఈ హఠాత్పరిణామంతో ప్రయాణికులు భయాందోళనలకు గురయ్యారు. ప్రమాదంలో పది మంది స్వల్పంగా గాయపడగా, తిరుపతికి చెందిన చిన్నారి సమ్విక తీవ్రంగా గాయపడింది. చిన్నారిని నెల్లూరులోని అపోలో ఆస్పత్రికి తరలించారు. మిగిలిన వారు స్థానిక ప్రైవేట్ ఆస్పత్రుల్లో ప్రాథమిక చికిత్స పొందారు. ఆపై గమ్యస్థానాలకు బయల్దేరారు. ప్రమాదం జరిగే సమయానికి బస్సు అతివేగంతో వస్తోందని సమాచారం. విషయం తెలుసుకున్న కోవూరు ఇన్‌స్పెక్టర్ సుధాకర్‌రెడ్డి, ఎస్సై రంగనాథ్‌గౌడ్ సిబ్బందితో కలిసి ఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. వాహనాన్ని క్రేన్ సాయంతో రోడ్డుపైకి లాగించారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.
భువనేశ్వర్ నుంచి బెంగళూరు వెళ్తుండగా ఘటన
చిన్నారికి తీవ్రగాయాలు
స్వల్ప గాయాలతో బయటపడిన ప్రయాణికులు

బోల్తాపడిన ప్రైవేట్ బస్సు