
ఆర్థరైటిస్‌పై నిర్లక్ష్యం వహిస్తే ముప్పే
నెల్లూరు (టౌన్): ఆర్థరైటిస్ సమస్యను నిర్లక్ష్యం చేస్తే భవిష్యత్తులో శరీర వైకల్యాలొచ్చే ప్రమాదం ఉందని బాలాజీనగర్ ఇన్‌స్పెక్టర్ సాంబశివరావు పేర్కొన్నారు. ప్రపంచ ఆర్థరైటిస్ డేను పురస్కరించుకొని వాకథాన్‌ను అపోలో సూపర్‌స్పెషాల్టీ ఆధ్వర్యంలో శనివారం నిర్వహించారు. ఆర్థరైటిస్‌కు అపోలోలో తక్కువ ఫీజుతో అందించే స్క్రీనింగ్ పరీక్షల బ్రోచర్లను వైద్యులతో కలిసి డైరెక్టర్ ఆ్‌ఫ్ మెడికల్ సర్వీసెస్ శ్రీరామ్ సతీష్ ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడారు. రూ.4590 విలువగల తొమ్మిది రకాల ఆర్థరైటిస్ స్క్రీనింగ్ పరీక్షలను రూ.1999కే అందించనున్నామని వివరించారు. రూ.8590 విలువగల మరో స్క్రీనింగ్ పరీక్షను రూ.3999కే చేయనున్నామని, ఈ అవకాశం డిసెంబర్ 31 వరకు అందుబాటులో ఉంటుందని చెప్పారు. ఆర్థోపెడిక్ సీనియర్ సర్జన్లు వివేకానందరెడ్డి, శశిధర్‌రెడ్డి, విక్రమ్‌రెడ్డి, యూనిట్ హెడ్ బాలరాజు తదితరులు పాల్గొన్నారు.