
రోడ్డు ప్రమాదాలను అరికట్టాలి
● ఐజీ సర్వశ్రేష్ట త్రిపాఠి
మనుబోలు: రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు చేపట్టాలని గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ట త్రిపాఠి ఆదేశించారు. స్థానిక పోలీస్‌స్టేషన్‌ను ఆకస్మికంగా శనివారం తనిఖీ చేసి రికార్డులను పరిశీలించారు. స్థానిక పరిస్థితులపై సిబ్బందిని ఆరాతీసిన అనంతరం ఆయన మాట్లాడారు. హైవేపై ప్రమాదాల నివారణకు అన్ని చర్యలు చేపట్టాలని సూచించారు. ధాభాలు , ఇతర చోట్ల జాతీయ రహదారిని ఆనుకొని లారీలను ఆపకుండా చర్యలు చేపట్టాలని చెప్పారు. యూటర్న్‌లు, ప్రమాదాలు ఎక్కువగా జరిగే అవకాశం ఉన్న క్రాస్‌రోడ్లను గుర్తించాలని సూచించారు. మండలంలోని 19 గ్రామాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశామని ఎస్సై శివరాకేష్ తెలిపారు. డీఎస్పీ శ్రీనివాసరావు, సీఐ శివరామకృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.