
ఐఎంఏ అధ్యక్షుడిగా మస్తాన్‌బాషా
నెల్లూరు(అర్బన్): ఇండియన్ మెడికల్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడిగా ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో పనిచేస్తున్న ఆర్థోపెడిక్ ప్రొఫెసర్ డాక్టర్ మస్తాన్‌బాషా, కార్యదర్శిగా నగరంలోని ఎండోక్రైనాలజిస్ట్ రామ్మోహన్‌రావును ఎన్నుకున్నారు. నెల్లూరు సరస్వతి నగర్‌లోని ఐఎంఏ హాల్లో గురువారం రాత్రి జరిగిన సభలో నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. కోశాధికారిగా డాక్టర్ హర్షవర్ధన్, నెల్లూరు మెడికల్ సొసైటీ చైర్మన్‌గా డాక్టర్ ఉమామహేశ్వరరెడ్డి, సెక్రటరీగా డాక్టర్ ప్రదీప్‌ను, కోశాధికారిగా డాక్టర్ వెంకటేశ్వర్లును ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. నూతన అధ్యక్షుడు మస్తాన్‌బాషా మాట్లాడుతూ అందరి సహకారంతో డాక్టర్ల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. తనను ఎన్నుకున్నవారికి ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో పూర్వ అధ్యక్షుడు డాక్టర్ అమరేంద్రనాథ్‌రెడ్డి, గౌరవ కార్యదర్శి డా.రాహుల్‌బాబు తదితరులు పాల్గొన్నారు.
మస్తాన్‌బాషా
రామ్మోహన్‌రావు

ఐఎంఏ అధ్యక్షుడిగా మస్తాన్‌బాషా