
యూరియా అమ్మకాల నిలిపివేత
మనుబోలు: పిడూరుపాళెంలో శ్రీ వెంకటేశ్వర ఫర్టిలైజర్స్‌లో సరైన అనుమతి పత్రాలు లేకపోవడంతో రూ.75,400 విలువైన యూరియాను విక్రయించడానికి వీల్లేదంటూ (స్టాప్ సేల్) ఆదేశాలు జారీ చేశామని ఏడీఏ కె.కన్నయ్య తెలిపారు. మండలంలోని ఎల్‌ఎన్‌పురం, కాగితాలపూరు, మనుబోలు, పిడూరుపాళెం, బద్దెవోలు గ్రామాల్లోని విత్తన, ఎరువుల దుకాణాలను శుక్రవారం వ్యవసాయ శాఖ అధికారులు తనిఖీ చేశారు. స్టాక్ రిజిస్టర్‌లు, బిల్ పుస్తకాలు, ఎరువుల నిల్వలను పరిశీలించారు. మన్నారు. ఆయన వెంట మనుబోలు మండల వ్యవసాయాధికారి వెంకటకృష్ణ, సిబ్బంది ఉన్నారు.