
న్యాయవాదుల నిరసన
నెల్లూరు(లీగల్): సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ బీఆర్ గవాయ్‌పై దాడికి యత్నించడాన్ని ఖండిస్తూ ఆలిండియా లాయర్స్ యూనియన్ (ఐలు) న్యాయవాదుల ఐక్యవేదిక ఆధ్వర్యంలో నెల్లూరులోని జిల్లా కోర్టు ఆవరణలో మంగళవారం నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ‘ఐలు’ అధ్యక్ష, కార్యదర్శి సత్తు అంకయ్య, చుక్క రమేష్, ఐక్యవేదిక నాయకులు కుడుముల రవికుమార్, బద్దెపూడి రవీంద్ర, స్వర్ణ ప్రసాద్, నెల్లూరు బార్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు పద్మాకర్, లేడీ రిప్రజెంటేటివ్ లక్ష్మమ్మ మాట్లాడుతూ రాజ్యాంగ వ్యవస్థలపై సనాతనం పేరుతో ఇలాంటి దుశ్చర్యకు పాల్పడటం దుర్మార్గమన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కేంద్ర ప్రభుత్వ పటిష్ట చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో వి.ఉపేంద్ర, పచ్చా కిరణ్, దేవరాల వెంకటేశ్వర్లు, సుధీర్, మోబీనా, కుమార్ రాజా, చక్రధర్ తదితరులు పాల్గొన్నారు.