
విక్రమ సింహపురి విద్యార్థికి అవార్డు
వెంకటాచలం: విక్రమ సింహపురి యూనివర్సిటీలో బయో టెక్నాలజీ విభాగానికి చెందిన ఎం.పృథ్వీరాజ్ జాతీయ ఎన్‌ఎన్‌ఎస్ ఉత్తమ వలంటీర్ అవార్డును న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో సోమవారం ద్రౌపది ముర్ము చేతుల మీదుగా స్వీకరించాడు. సామాజిక సేవలో చేసిన విశేష కృషికి ఈ అవార్డు దక్కిందని వీసీ అల్లం శ్రీనివాసరావు, ఇతర అధ్యాపకులు తెలిపారు.
రాళ్లపాడు నుంచి
మృతదేహం వెలికితీత
లింగసముద్రం: రాళ్లపాడు ప్రాజెక్ట్‌లో ఆదివారం గుర్తించిన మృతదేహాన్ని సోమవారం గజ ఈతగాళ్ల సాయంతో వెలికితీశారు. ఎస్సై నారాయణ కథనం మేరకు.. మృతుడు గుండు చేయించుకుని ఉన్నాడు. ముదురు నీలం రంగు ప్యాంట్ ధరించాడు. మృతదేహాన్ని కందుకూరు ఏరియా వైద్యశాల మార్చురీకి తరలించారు. మృతదేహం ఉన్న తీరు చూసినవారు హత్య చేసి ప్రాజెక్ట్‌లో పడేసి వెళ్లి ఉంటారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కేసు దర్యాప్తులో పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.