
ఘనంగా వారాహి సిల్క్స్ ప్రారంభం
● సందడి చేసిన నటి మీనాక్షి చౌదరి
నెల్లూరు(బృందావనం): నగరంలోని మినీబైపాస్‌లో వారాహి సిల్క్స్ షోరూమ్‌ను సినీ నటి మీనాక్షి చౌదరి గురువారం ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. సంప్రదాయ, ఫ్యాషన్ వస్త్రాలకు పెట్టింది పేరైన వారాహి సిల్క్స్‌కు ప్రచారకర్తగా వ్యవహరిస్తున్నానని చెప్పారు. షోరూమ్‌ను యాంకర్ సుమ కనకాల, సంస్థ మేనేజింగ్ డైరెక్టర్లు మణిదీప్ ఏచూరి, డాక్టర్ స్పందన మద్దుతో కలిసి అభిమానుల సమక్షంలో ప్రారంభించడం ఆనందంగా ఉందని తెలిపారు. అభిమానులతో సెల్ఫీలు దిగుతూ తాను నటించిన చిత్రాల్లోని డైలాగులు చెప్తూ సందడి చేశారు. దీంతో ఆ ప్రాంతమంతా కోలాహలంగా మారింది. అనంతరం మేనేజింగ్ డైరెక్టర్లు మాట్లాడారు. రాష్ట్రంలో మొదటి షోరూమ్‌ను నెల్లూరులో ప్రారంభించామని చెప్పారు. హైదరాబాద్‌లోని ప్యాట్నీ సెంటర్, విజయవాడలో షోరూమ్‌లను త్వరలో ప్రారంభించనున్నామని వెల్లడించారు. రూ.500 నుంచి రూ.10 లక్షల వరకు చీరలు అందుబాటులో ఉన్నాయన్నారు. రూ.పది వేల వస్త్రాల కొనుగోలుపై 22 క్యారెట్ల బంగారు నాణేన్ని అందిస్తున్నామని, ఈ ఆఫర్ అక్టోబర్ ఐదు వరకు ఉంటుందని తెలిపారు.

ఘనంగా వారాహి సిల్క్స్ ప్రారంభం