
మెంటల్ బాలకృష్ణా.. నోరు అదుపులో ఉంచుకో
● అభిమానులను కొట్టే సంస్కృతి నీదే..
● పిచ్చి పీక్స్‌కు పోయిందా..
రాత్రి తాగింది దిగలేదా..?
● ధ్వజమెత్తిన కాకాణి గోవర్ధన్‌రెడ్డి
సాక్షిప్రతినిధి, నెల్లూరు: సినీ నటుడు బాలకృష్ణకు మెంటల్ ఉందని.. ఈ విషయమై తాను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదని.. తనకు మతిస్థిమితం లేదని డాక్టర్ల వద్ద ఆయన సర్టిఫికెట్‌ను తెచ్చుకున్నారని.. అలాంటి వ్యక్తి అసెంబ్లీలో తమ పార్టీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డిని విమర్శించడాన్ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి ఖండించారు. ఈ మేరకు నెల్లూరులో విలేకరులతో గురువారం ఆయన మాట్లాడారు. జగన్‌మోహన్‌రెడ్డిని విమర్శించడంతో పాటు చిరంజీవిని అవమానించారని పేర్కొనడాన్ని తప్పుబట్టారు. నటులను జగన్‌మోహన్‌రెడ్డి ఎప్పుడూ అవమానించలేదన్నారు. ఆయన్ను కలిసేందుకు చిరంజీవి గతంలో వెళ్లినప్పుడు సాదరంగా ఆహ్వానించారని, అంతేకాకుండా కలిసి భోజనం చేశారని గుర్తుచేశారు. వాస్తవాలను వక్రీకరించి బాలకృష్ణ మాట్లాడటం దారుణమన్నారు. దగ్గరికొచ్చిన అభిమానులను కొట్టడం, ఫోన్లో తిట్టడం లాంటి ఛండాలమైన సంస్కృతి బాలకృష్ణదేనని విమర్శించారు.. బాలకృష్ణకు పిచ్చి పీక్స్‌కు చేరి.. రాత్రి తాగింది ఇంకా దిగక ఇలా మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. ఇప్పటికై నా నోటిని అదుపులో ఉంచుకోవాలని, లేని పక్షంలో జరగబోయే తీవ్ర పరిణామాలకు బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు.