
సాగు తగ్గించడమే మేలు
నిమ్మ సాగును కొంత వరకు తగ్గించడమే మేలు. బోర్ల ద్వారా నీటి సౌకర్యం ఉన్న ప్రతి రైతు దీనిపై మక్కువ చూపుతున్నారు. దిగుబడి పెరిగితే డిమాండ్ తగ్గుతుందనే విషయాన్ని తెలుసుకోవాలి. మూడు నెలలే అంతో ఇంతో డిమాండ్ ఉంటుంది. ఆ తర్వాత కష్టాలు పడాల్సి వస్తుంది. కూలిలు సైతం గిట్టుబాటు కాక ఇబ్బందులు పడ్డాం.
– శంకర్‌రెడ్డి, రైతు, ముదిగేడు
కష్టంగా ఉంది
నిమ్మ సాగు కష్టంతో కూడుకున్న పని. కంపోస్ట్ ఎరువులను ఏటా తోలి యాజమాన్య పద్ధతులను చేపట్టాల్సి ఉంటుంది. పెట్టుబడులు బాగా అవుతున్నా, అందుకు తగిన విధంగా రాబడి ఉండటం లేదు. వేసవిలోనే ధరలు పతనమైతే రైతులు కోలుకోలేని పరిస్థితి ఏర్పడుతుంది. సాగు తగ్గించుకోవడమే మంచిదనిపిస్తోంది.
– దయాకర్‌రెడ్డి, రైతు, కల్యాణపురం
భవిష్యత్తులో ఇబ్బందులు
నిమ్మకు ఇప్పటికిప్పుడు వచ్చిన ఇబ్బందుల్లేకపోయినా, భవిష్యత్తులో సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. బయటి రాష్ట్రాల్లో నిమ్మ సాగు పెరుగుతోంది. బిహార్‌లో సైతం దీన్ని పండిస్తున్నారంటే ఆశ్చర్యంగా ఉంది. మన ప్రాంతంలో డిమాండ్ తగ్గేందుకు ఇదీ ఓ కారణంగా భావించాల్సి వస్తోంది.
– బాలకృష్ణారెడ్డి, వ్యాపారి, నిమ్మ మార్కెట్ యార్డు, పొదలకూరు
●

సాగు తగ్గించడమే మేలు

సాగు తగ్గించడమే మేలు