
రూ.100 కోట్లతో రిటైనింగ్ వాల్‌కు శ్రీకారం
నెల్లూరు (వీఆర్సీసెంటర్): టీడీపీ.. అంటేనే ‘టెండర్ వేయ్.. దోచుకో.. పంచుకో’ అనే అర్థమని ‘పెన్నానది రిటైనింగ్ వాల్’ టెండర్‌తో రుజువైంది. అభివృద్ధి పేరుతో అడ్డంగా దోచుకునేందుకు జిల్లాకు చెందిన ఓ మంత్రి స్కెచ్ వేశారు. గతంలోనూ పేద ప్రజల ఇళ్ల నిర్మాణం పేరుతో సదరు మంత్రి రూ.వేల కోట్లు కాజేశారనే ఆరోపణలు ఎదుర్కొన్నారు. ప్రభుత్వంలో కీలక మంత్రిగా వ్యవహరిస్తున్న ఆయన ప్రజాధనాన్ని కాజేసేందుకు వేసిన టెండర్ చూస్తే జిల్లా ప్రజలే కాదు.. రాష్ట్ర ప్రజలూ నివ్వెర పోవాల్సిందే.
14 ఏళ్లు టీడీపీ అధికారంలో ఉన్నా..
సోమశిల జలాశయం నుంచి వరద నీటిని పెన్నాకు విడుదల చేసిన ప్రతిసారి నది పక్కనే ఉన్న లోతట్టు ప్రాంతాలైన భగసింగ్ కాలనీ, జనార్దన్‌రెడ్డి కాలనీ, గాంధీగిరిజన కాలనీ ప్రాంతాలు పూర్తిగా నీటి మునిగి ప్రజలు నిరాశ్రయులు అవుతున్నారు. రెండున్నర దశాబ్దాల కాలంలో 14 ఏళ్లు అధికారంలో ఉన్న టీడీపీ ప్రభుత్వం ఏనాడు ఈ సమస్యకు పరిష్కారం చూపించాలని ఆలోచించలేదు. వరద ముంపు వచ్చినప్పుడు కూడా ఆయా ప్రాంతాల ప్రజలకు సహాయం అందించిన పాపాన పోలేదు.
రిటైనింగ్ వాల్‌కు శాపం..
ఎన్నికలకు ముందు ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ నాయకులు రూ.100 కోట్ల రిటైనింగ్ వాల్ నిర్మాణంతో ప్రయోజనంలేదని, ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని విమర్శించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే రిటైనింగ్ వాల్ పనులను నిలిపివేశారు. రిటైనింగ్ వాల్ పనులు పూర్తికాకపోవడంతో తాజాగా వరదలు రావడంతో నీరు భగత్‌సింగ్‌్ కాలనీలోకి ప్రవేశించకుండా తాత్కాలికంగా ఇసుక బస్తాలు, మట్టి కట్టలు కట్టుతూ ఆ మేరకు నిధులు మెక్కుతున్నారు.
170 శాతం అంచనాలు పెంచి..
వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో రిటైనింగ్‌వాల్ నిర్మాణాన్ని విమర్శించిన టీడీపీ నేతలు అదే పనులకు గతంలో ఖరారైన రూ.100 కోట్ల మొత్తంపై 170 శాతం మేర అంచనాలు పెంచి రూ.270 కోట్లకు టెండర్ ఖరారు చేసేందుకు జలవనరుల శాఖాధికారుల ద్వారా ప్రతిపాదనలు పంపారని విశ్వసనీయ సమాచారం. గత ప్రభుత్వం రూ.100 కోట్లతో పూర్తి చేసేందుకు టెండర్లు ఖరారు చేస్తే.. రూ.270 కోట్లకు అంచనాలను పెంచడంపై సర్వత్రా ఆరోపణలు వెల్లువెల్లుతున్నాయి.
ఆగిపోయిన రిటైనింగ్‌వాల్ పనులు
పెన్నానదికి వరదలు వచ్చిన ప్రతీసారి నదికి ఆనుకుని ఉన్న భగత్‌సింగ్‌కాలనీ జలమయమయ్యేది. ఇళ్లు, సామగ్రి అంతా నీటిలో కొట్టుకుపోయేవి. కానీ గతంలో నిర్మించిన రిటైనింగ్ వాల్ వల్ల వరదనీరు భగత్‌సింగ్‌కాలనీకు వచ్చే ప్రమాదం తప్పింది. దీంతో ని శ్చింతంగా ఉన్నాం. ఆ గోడే లేకపోతే మళ్లీ భగత్‌సింగ్‌కాలనీ జలమయమయ్యేది. వరద ఇంతకంటే పెరిగితే నీరొచ్చే అవకాశం ఉంది.
– సుజాత, స్థానికురాలు
మరలా జలమయమయ్యేది

రూ.100 కోట్లతో రిటైనింగ్ వాల్‌కు శ్రీకారం

రూ.100 కోట్లతో రిటైనింగ్ వాల్‌కు శ్రీకారం