
జగన్‌ను కలిసిన పేర్నాటి
నెల్లూరు(పొగతోట): వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని తాడేపల్లిలోని నివాసంలో ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి పేర్నాటి శ్యామ్‌ప్రసాద్‌రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు.
జిల్లాకు 2,838
ఇళ్ల కేటాయింపు
నెల్లూరు(అర్బన్): ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్ 2.0 కింద నెల్లూరు జిల్లాకు 2024 – 25 సంవత్సరానికి 2,430, 2025 – 26కు 408 కలిపి మొత్తం 2,838 ఇళ్లను కేంద్ర ప్రభుత్వం కేటాయించింది. ఇందుకు సంబంధించి జీఓ ఆర్టీ నంబర్ 65 రెండు రోజుల క్రితం విడుదలైంది. ఒక్కో యూనిట్ నిర్మాణానికి రూ.2.50 లక్షలు కేటాయించింది. అందులో కేంద్రం రూ.1.50 లక్షలు, రాష్ట్ర ప్రభుత్వం రూ.లక్ష భరించనున్నాయి. లబ్ధిదారుడే స్వయంగా ఇల్లు నిర్మించుకోవాల్సి ఉంటుంది. అదనంగా అయ్యేను వారే పెట్టుకోవాలి. ఇంటి నిర్మాణ విస్తీర్ణం కనిష్టంగా 30 చదరపు మీటర్లు, గరిష్టంగా 45 చదరపు మీటర్లుగా ఉండాలని జీఓలో పేర్కొన్నారు. వెబ్‌పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దీనిపై జిల్లా హౌసింగ్ కార్పొరేషన్ పీడీ వేణుగోపాల్‌రెడ్డి మాట్లాడుతూ దరఖాస్తు చేసుకోవాల్సిన వివరాలు, విధి, విధానాలు త్వరలోనే తెలియజేస్తామన్నారు.