
గాలికుంటు టీకాలేయించాలి
● కలెక్టర్ హిమాన్షు శుక్లా
నెల్లూరు(అర్బన్): జిల్లాలోని పశువులకు గాలికుంటు వ్యాధి రాకుండా నివారించేందుకు గానూ టీకాలను సోమవారం నుంచి వేయించాలని కలెక్టర్ హిమాన్షు శుక్లా సూచించారు. దీనికి సంబంధించిన పోస్టర్లను కలెక్టరేట్లో పశుసంవర్థక శాఖ ఆధ్వర్యంలో శనివారం ఆవిష్కరించిన అనంతరం ఆయన మాట్లాడారు. టీకాలను వచ్చే నెల 15 వరకు వేయనున్నారని చెప్పారు. నాలుగు నెలలు దాటిన గేదెలు, ఆవులకు టీకాలను పాడి రైతులు తప్పక వేయించాలని సూచించారు. పశుసంవర్థక శాఖ సంయుక్త సంచాలకుడు రమేష్‌నాయక్ తదితరులు పాల్గొన్నారు.