
మంచి పద్ధతి కాదు
కేసులు పెట్టడం దుర్మార్గం
●
ఎన్నికల సమయంలో ప్రజలకిచ్చిన హామీలను నెరవేర్చకపోవడాన్ని గుర్తుచేస్తూ, ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతున్న సాక్షిపై కేసులు పెట్టడం దుర్మార్గం. కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా వార్తలు రాసే జర్నలిస్టులపై కేసులు పెట్టడం దారుణం. దీనికి వ్యతిరేకంగా రానున్న రోజుల్లో పోరాటాలు చేయాల్సిన పరిస్థితులు తలెత్తే అవకాశముంది.
– మూలం రమేష్, సీపీఎం జిల్లా కార్యదర్శి
మీడియా గొంతు నొక్కేందుకు కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తోంది.
ఇది మంచి పద్ధతి కాదు. ప్రజల పక్షాన నిలిచే మీడియాపై కక్ష సాధింపులకు దిగడం సరికాదు. ప్రతిపక్షపాత్ర పోషిస్తున్న సాక్షిపై, అందులో పనిచేసే ప్రతినిధులపై అక్రమ కేసులు పెట్టడం ప్రభుత్వ దిగజారుడుతనానికి పరకాష్ట. కేసులను ఎత్తేయాలి.
– మారుబోయిన రాజా, కార్యదర్శి, సీపీఎం నరుకూరు శాఖ

మంచి పద్ధతి కాదు

మంచి పద్ధతి కాదు