
గంజాయి విక్రయాలపై దాడులు
నెల్లూరు(క్రైమ్): ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు శుక్రవారం గంజాయి విక్రయాలపై దాడులు చేశారు. ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. నెల్లూరు బీవీ నగర్‌లోని ఆ శాఖ కార్యాలయంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ ఇన్‌స్పెక్టర్ పి.అనిత వివరాలు వెల్లడించారు. అనిత తన సిబ్బందితో కలిసి వెంకటేశ్వరపురంలో గంజాయి విక్రయిస్తున్న ఎస్‌డీ మౌలాలీని అదుపులోకి తీసుకున్నారు. అతడి వద్ద 300 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. కోవూరు మండలంలోని పోతిరెడ్డిపాళెంలో గంజాయి విక్రేత ఎ.ఓమ్రేష్‌ను అదుపులోకి తీసుకుని 2.5 కేజీలను స్వాధీ నం చేసుకున్నారు. తదుపరి దర్యాప్తు నిమిత్తం నిందితుడు మౌలాలీని నెల్లూరు ఎకై ్సజ్ – 1 స్టేషన్లో, ఓమ్రేష్‌ను కోవూరు ఎకై ్సజ్ స్టేషన్‌లో అప్పగించారు. గంజాయి విక్రయాలు, అక్రమ రవాణాపై టోల్‌ఫ్రీ నంబర్ 1972కు సమాచారం అందిస్తే తగిన చర్యలు తీసుకుంటామని అనిత తెలిపారు. దాడుల్లో ఎన్‌ఫోర్స్‌మెంట్ ఎస్సై సీహెచ్ పూర్ణకుమార్, హెచ్‌సీలు ఎ.రమేష్‌కుమార్, ఎం.కిరణ్ సింగ్, ఎన్.ప్రసాద్, కానిస్టేబుళ్లు ఎం.మునిరాజ్‌కుమార్, ఎం.వెంకటేశ్వర్లు, కె.రమణయ్య తదితరులు పాల్గొన్నారు.