
ముస్లింలకు చంద్రబాబు ద్రోహం
నెల్లూరు (అర్బన్): అన్ని వర్గాల ప్రజలను మోసం చేసినట్లుగానే సీఎం చంద్రబాబు ముస్లింలను దగా చేశాడని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీమంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి దుయ్యబట్టారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఇమామ్‌లకు, మౌజన్‌లకు గౌరవ వేతనం తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఎమ్మెల్సీ చంద్రశేఖర్‌రెడ్డి, పలువురు మైనార్టీ నాయకులు, ముస్లిం మతపెద్దలతో కలిసి సోమవారం కలెక్టరేట్‌లో కలెక్టర్ ఆనంద్‌కు కాకాణి గోవర్ధన్‌రెడ్డి వినతి పత్రం అందజేశారు. ఆయన మాట్లాడుతూ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మసీదులను పర్యవేక్షించే, ప్రార్థనలు చేసే మౌజన్‌లకు రూ.5వేలు, ఇమామ్‌లకు రూ.10 వేలు ప్రతి నెలా క్రమం తప్పకుండా చెల్లించేవారన్నారు. గత ఎన్నికల సందర్భంగా చంద్రబాబు గౌరవ వేతనం పెంచుతానని హామీ ఇచ్చాడన్నారు. ప్రతి నెలా మసీదుల పర్యవేక్షణకు మరో రూ.5 వేలు ఇస్తానని తెలిపాడన్నారు. మసీదుల పర్యవేక్షణకు చందాలు ఇచ్చే దాతలు ఇప్పడు ప్రభుత్వం ఇస్తుందనే ఉద్దేశంతో ఆపేశారన్నారు. అటు దాతలు చందాలు ఇవ్వక, ఇటు ప్రభుత్వం గౌరవ వేతనాలకు, నిర్వహణకు నిధులు విడుదల చేయక మసీదు నిర్వాహకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. మైనార్టీల అభివృద్ధి దివంగత ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి, మాజీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి కాలంలోనే జరిగిందన్నారు. వారికి నాలుగు శాతం రిజర్వేషన్లు రాజశేఖరరెడ్డి కల్పించారన్నారు. జగన్‌మోహన్‌రెడ్డి దుల్హన్ పథకం కింద పేద ముస్లిం ఆడబిడ్డల పెళ్లిళ్లలకు ఆర్థిక చేయూత అందించారన్నారు. చంద్రబాబు అధికారంలోకి రాగానే దుల్హన్ పథకాన్ని నిర్వీ ర్యం చేశారన్నారు. ఎమ్మెల్సీ చంద్రశేఖర్‌రెడ్డి మాట్లాడుతూ ఇమామ్, మౌజన్‌లకు గౌరవ వేతనం ఇవ్వకుండా సీఎం చంద్రబాబు అవమానించారన్నారు. ఇప్పటికై నా కూటమి ప్రభుత్వం గౌరవ వేతనాలు విడుదల చేయా లని లేదంటే వైఎస్సార్‌సీపీ మైనార్టీలకు అండగా ఉండి పోరాటం ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కలెక్టర్ సానుకూలంగా స్పందించి ప్రభుత్వానికి నివేదిక పంపుతానన్నా రు. అనంతరం పలువురు మైనార్టీలు మాట్లాడుతూ జగన్‌మోహన్‌రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు ఒకటో తేదీనే గౌరవ వేతనాలు ఇచ్చేవారన్నారు. ఇప్పుడు వేతనాలు ఇవ్వకుండా ఆపేయడం దుర్మార్గమన్నారు. ఈ సందర్భంగా మైనార్టీలు పెద్ద ఎత్తున ముస్లింల ద్రోహి చంద్రబాబు అంటూ నినాదాలు చేశారు. ప్రభుత్వం తీరుపై నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మైనార్టీ నేతలు ఖలీల్‌అహ్మద్, హంజాహుస్సేని, సిద్దిఖ్, కరీముల్లా, సమీర్‌ఖాన్, మహబూబ్‌బాషా, మస్తాన్, యజ్దాని, అలీమ్, జిల్లాలోని పలు ప్రాంతాల మౌజన్లు, ఇమామ్‌లు పాల్గొన్నారు.
ఇమామ్‌లు, మౌజన్‌లకు 11 నెలలుగా గౌరవ వేతనం
ఎగనామం
ద్రోహి అంటూ మైనార్టీలు
నినాదాలు
ఎమ్మెల్సీ చంద్రశేఖర్‌రెడ్డితో కలిసి కాకాణి కలెక్టర్ ఆనంద్‌కు వినతి పత్రం అందజేత