
యూరియా కొరత తీరుస్తాం
ఉదయగిరి: మెట్ట ప్రాంతంలో ఆలస్యంగా సాగు చేపట్టిన వరికి యూరియా కొరత లేకుండా తీరుస్తామని జిల్లా వ్యవసాయాధికారిణి పి.సత్యవాణి చెప్పారు. ఉదయగిరిలో సోమవారం యూరియా పంపిణీలో రైతుల వెతలపై మంగళవారం ‘సాక్షి’లో ప్రచురితమైన కథనం నేపథ్యంలో ఆమె మంగళవారం ఉదయగిరికి చేరుకుని అధికారులు, రైతులతో మాట్లాడారు. జిల్లాలో సాగులో ఉన్న పంటల వినియోగానికి సంబంధించి అవసరమైన యూరియా అందుబాటులో ఉందని, రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ఉదయగిరి, మర్రిపాడు, వరికుంటపాడు మండలాల్లో సాగులో ఉన్న పంటలకు అవసరమైన యూరియాను బుధవారం నుంచి ఉదయగిరి మండలం గుడినరవ, బండగానిపల్లిలో నిల్వలు ఉంచుతున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో ఏడీఏ లక్ష్మీమాధవి, అన్ని మండలాల వ్యవసాయ విస్తరణాధికారులు, వ్యవసాయ సిబ్బంది పాల్గొన్నారు.
సమాచార శాఖ డీడీగా
వేణుగోపాల్‌రెడ్డి
నెల్లూరురూరల్: జిల్లా పౌర సమాచార శాఖ డిప్యూటీ డైరెక్టర్‌గా పీ వేణుగోపాల్‌రెడ్డిని నియమిస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. అన్నమయ్య జిల్లాలో పౌర సమాచారశాఖ అసిస్టెంట్ డైరెక్టర్‌గా ఉన్న పీ వేణుగోపాల్‌రెడ్డికి డిప్యూటీ డైరెక్టర్‌గా పదోన్నతి కల్పిస్తూ నెల్లూరు పౌర సమాచారశాఖ డీడీగా నియమించింది.
శ్రీవారి దర్శనానికి
12 గంటలు
తిరుమల : తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. క్యూ కాంప్లెక్స్‌లో 10 కంపార్ట్‌మెంట్లు నిండాయి. సోమవారం అర్ధరాత్రి వరకు 77,117 మంది స్వామి వారిని దర్శించుకోగా 22,765 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామి వారికి కానుకల రూపంలో హుండీలో రూ.2.10 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టికెట్లు కలిగిన భక్తులకు సకాలంలోనే దర్శనమవుతోంది. దర్శన టికెట్లు లేని భక్తులకు 12 గంటల్లో దర్శనం లభిస్తోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు కలిగిన భక్తులకు 3 గంటల్లో దర్శనం అవుతోంది. ఇదిలా ఉంటే సర్వదర్శనం టోకెన్లు కలిగిన భక్తులు నిర్దేశించిన సమయానికి క్యూలో వెళ్లాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది. కేటాయించిన సమయాని కంటే ముందు వెళ్లిన భక్తులను క్యూలోకి అనుమతించరని స్పష్టం చేసింది.
27న ఫొటోగ్రఫీ, రీల్స్,
వీడియోల పోటీలు
నెల్లూరురూరల్: ఈ నెల 27న ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా జిల్లా పర్యాటక శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక ఫొటోగ్రఫీ, రీల్స్ వీడియోల పోటీలు నిర్వహించనున్నట్లు జిల్లా పర్యాటక అధికారి ఉషశ్రీ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని పర్యాటక ప్రదేశాలు, సాంస్కృతిక వారసత్వ కోటలు, జలపాతాలు, ఎకోటూరిజం, స్థానిక వంటకాలు వంటి అంశాలను ప్రోత్సహిస్తూ విద్యార్థులు, ఫొటోగ్రాఫర్లు, సజనాత్మక ప్రతిభ కలిగిన వారు ఈ పోటీల్లో పాల్గొనాలని కోరారు. ఫొటోలు హైరిజల్యూషన్ కలిగి నెల్లూరు జిల్లాలో తీసినవే అయి ఉండాలన్నారు. జేపీజీ ఫార్మాట్లో అందించాలన్నారు. ఈ పోటీల్లో పాల్గొనే వారు ఈ నెల 20వ తేదీలోపు అందజేయాలని కోరారు. రీల్స్, వీడియోల పోటీలకు రీల్స్ 30–90 సెకన్లు (ఇన్‌స్టాగాం), వీడియో వ్యవధి గరిష్టంగా 3 నిమిషాలు ఉండేలా రూపొందించాలని సూచించారు. ఈ పోటీల విజేతలకు ప్రథమ బహుమతి రూ.5,000, ద్వితీయ బహుమతి రూ.3,000, తృతీయ బహుమతి రూ.2,000తోపాటు జ్ఞాపికలు, సర్టిఫికెట్లు ఈ నెల 27న ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా కలెక్టర్ ఆధ్వర్యంలో అందజేయనట్లు ఆమె చెప్పారు. ఫొటోలు, వీడియోలు, రీల్స్‌ను ఈ నెల 20వ తేదీ సాయంత్రం 5 గంటల్లోగా జిల్లా పర్యాటక శాఖాధికారి కార్యాలయం, 2వ అంతస్తు, బోట్ షికారు క్యాంపస్, బారా షాహిద్ దర్గా దగ్గర, దర్గామిట్ట, నెల్లూరులో అందించాలని ఆమె సూచించారు. పోటీల్లో పాల్గొనదలచిన అభ్యర్థులు తమ వివరాలకు 9493668022 / 7780749802 నంబర్లలో నమోదు చేసుకోవాలని, క్యూఆర్ కోడ్ ద్వారా నమోదు చేసుకోవచ్చని తెలిపారు.

యూరియా కొరత తీరుస్తాం

యూరియా కొరత తీరుస్తాం

యూరియా కొరత తీరుస్తాం