
కొమ్మలపూడిలో అగ్నిప్రమాదం
● రెండు పూరిళ్లు దగ్ధం
మనుబోలు: మండలంలోని కొమ్మలపూడి గిరిజన కాల నీలో అ గ్నిప్రమాదం జరిగింది. రెండు పూరిళ్లు దగ్ధమై రూ.లక్ష నష్టం వాటిల్లింది. స్థానికుల కథనం మేరకు.. కాలనీకి చెందిన వెందోటి శీనమ్మ, వెందోటి చందనమ్మ మేకలు మేపుతుంటారు. మంగళవారం ఉదయం మేకలు మేపేందుకు పొలానికి వెళ్లారు. ఏమైందో తెలియదు గానీ పూరిళ్లు మంటల్లో కాలిపోయాయి. ఎవరైనా సిగరెట్, బీడీ తాగి పడేసి ఉంటారని భావిస్తున్నారు. పక్కనే ఉన్న మేకల కొట్టం కూడా దగ్ధమైంది. శీనమ్మ ఇంట్లోని బీరువాలో ఉన్న రూ.50 వేల నగదు, నిత్యావసర సరుకులు, టీవీ, దుస్తులు కాలిపోయాయి. సమాచారం అందుకున్న ఆర్‌ఐ అరుణ్‌తేజ్, వీఆర్వో బుజ్జయ్య ఘటనా స్థలాన్ని పరిశీలించి నివేదికను ఉన్నతాధికారులకు పంపించారు.