
కాకాణిని కలిసిన తూమాటి
కందుకూరు: మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్‌రెడ్డిని ఎమ్మెల్సీ తూమాటి మాధవరావు మంగళవారం నెల్లూరులోని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. జిల్లాలోని రాజకీయ అంశాలపై చర్చించినట్లు తూమాటి తెలిపారు.
న్యూరో సర్జన్‌కు గోల్డ్‌మెడల్
నెల్లూరు(అర్బన్): ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ 27వ, 28వ కాన్వొకేషన్ విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరుగుతోంది. ఇందులో భాగంగా నెల్లూరు నగరానికి చెందిన ప్రముఖ న్యూరో సర్జన్ డాక్టర్ ధీరజ్ రాష్ట్ర స్థాయిలో మొదటి ర్యాంక్‌తో గోల్డ్‌మెడల్‌ను సాధించారు. 2021 – 22 సంవత్సరానికి సంబంధించి స్టేట్ బెస్ట్ ఔట్ గోయింగ్ స్టూడెంట్ కింద మంగళవారం రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ చేతుల మీదుగా మెడల్, ప్రశంసాపత్రాన్ని అందుకున్నారు. ధీరజ్ మాట్లాడుతూ ఈ అవార్డును స్ఫూర్తిగా తీసుకుని పేదలకు తక్కువ ఖర్చుతో నాణ్యమైన వైద్యం అందించేందుకు కృషి చేస్తానన్నారు.
వ్యక్తి అనుమానాస్పద
మృతి
కోవూరు: మండలంలోని పడుగుపాడు – జమ్మిపాళెం అండర్ బ్రిడ్జి కింద నీటిలో మంగళవారం ఉదయం ఓ వ్యక్తి మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించగా ఎస్సై రంగనాథ్ గౌడ్ సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని బయటకు తీయించారు. వయసు 30 నుంచి 35 సంవత్సరాల మధ్య ఉండొచ్చని భావిస్తున్నారు.అనంతరం పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. మృతుడి శరీరంపై గాయాలున్నాయి. అనుమానాస్పద మృతిగా భావిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

కాకాణిని కలిసిన తూమాటి

కాకాణిని కలిసిన తూమాటి