
నిరంతరాయంగా యూరియా సరఫరా
● కలెక్టర్ ఆనంద్
నెల్లూరురూరల్: జిల్లాలో రైతుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని నిరంతరాయంగా యూరియాను సరఫరా చేస్తున్నట్లు కలెక్టర్ ఆనంద్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రస్తుతం జిల్లాలో 2,471 మెట్రిక్ టన్నుల యూరియా నిల్వలు ఉన్నాయన్నారు. రాబోయే 10 రోజుల్లో మరో 500 మెట్రిక్ టన్నుల యూరియా జిల్లాకు రానున్నట్లు చెప్పారు. రైతులు ఆధార్ విధానం ద్వారా యూరియా కొనుగోలు చేయాలని సూచించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా రైతు సేవా కేంద్రాల్లో యూరియా అందుబాటులో ఉంచుతున్నట్లు చెప్పారు. ఎవరైనా అధిక ధరలకు యూరియా అమ్మితే సమీపంలో ఉన్న మండల వ్యవసాయ అధికారికి ఫిర్యాదు చేయాలన్నారు. యూరియాకు ఇబ్బందులు పడుతుంటే టోల్ ఫ్రీ నంబరు 8331057285లో సంప్రదించాలని, రైతులు ఎలాంటి ఆందోళన చెందకుండా, యూరియాను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ పిలుపునిచ్చారు.