చేయూత ఇవ్వక చేనేతకు చుక్కలు | - | Sakshi
Sakshi News home page

చేయూత ఇవ్వక చేనేతకు చుక్కలు

Aug 7 2025 10:15 AM | Updated on Aug 7 2025 10:15 AM

చేయూత

చేయూత ఇవ్వక చేనేతకు చుక్కలు

నేతన్న నేస్తంతో

ఆర్థిక ఉపశమనం

చేనేత వృత్తిలో 40 ఏళ్లగా ఉన్నాను. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో ఇచ్చిన నేతన్న నేస్తం నా కుటుంబానికి ఆర్థికంగా ఉపశమనం కలిగించింది. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం మాకు ఎటువంటి మేలు చేయడం లేదు. గత ప్రభుత్వంలో మూలన పడేసి మగ్గాలు మళ్లీ వేగం పుంజుకున్నాయి. ఈ ప్రభుత్వం వచ్చాక పరిస్థితులు చాలా దారుణంగా మారాయి. పాలకులు స్పందించకపోతే అందమైన మన చేనేత సంప్రదాయం కనుమరుగవుతుంది.

– బొడిచెర్ల రవి, సంగం

గిట్టుబాటు ధర కూడా

రావడం లేదు

రోజంతా కుటుంబం కష్టపడినా రూ.300కు మించి గిట్టుబాటు ధర కూడా రావడం లేదు. ప్రభుత్వాలు ముడి సరుకుల మీద ధరలు తగ్గించాలి. జీఎస్టీని తగ్గిస్తే చేనేత వస్త్రాలకు డిమాండ్‌ పెరిగి కొంచమైనా లాభాలు వస్తాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మా బతుకులు మళ్లీ గుంతలో పడ్డాయి. వైఎస్సార్‌సీపీ హయాంలో నేతకు పెట్టుబడి సాయంతోపాటు అనేక పథకాలు మా కుటుంబానికి ఎంతో దోహదపడ్డాయి.

– మాసాబత్తుల రమణమ్మ,

నారాయణరెడ్డి పేట

అనాదిగా నేత వృత్తినే నమ్ముకుని కుటుంబాలను పోషించుకునే చేనేతల జీవితాల్లో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక కొత్త వెలుగులు నింపారు. గతంలో ఆర్థిక చేయూత లేక మగ్గాలను వదిలేసిన నేత సంప్రదాయ కుటుంబాలు మళ్లీ పగ్గం పట్టాయి. వరుసగా ఐదేళ్లు వారి ఖాతాల్లో ‘వైఎస్సార్‌ నేతన్న నేస్తం’ జమ కావడంతో కదిలిన మగ్గం అవిశ్రాంతంగా సాగాయి. అప్పుల ఊబిలో నుంచి తేరుకున్నాయి.

సహకారం అందించాలి

ప్రభుత్వాలు చేనేత రంగానికి సహకారం అందించాలి. అనేక సమస్యలు ఎదు ర్కొంటున్న వారికి గతం ప్రభుత్వం ఇచ్చిన పథకాలను పునరుద్ధరించాలి. చేనేతలకు కేటాయించిన 11 రకాల రిజర్వేషన్‌ నిబంధనలను ఉల్లంఘించి పవర్‌లూమ్‌ మగ్గాలపై వస్త్రాలను తయారు చేస్తున్నారు. ఆప్కోకు పాలక పార్టీల చేయూత తగ్గిపోయింది. హెల్త్‌ స్కీంను, కచ్చితంగా అమలు చేయాలి.

– బుధవరపు బాలాజీ, చేనేత ఐక్య కార్యాచరణ కమిటీ జిల్లా అధ్యక్షుడు

చంద్రబాబు దగా జాబితాలో నేతన్నలు

వైఎస్సార్‌సీపీ హయాంలో

‘వైఎస్సార్‌ నేతన్న నేస్తం’ అమలు

ఐదేళ్లలో ప్రతి కుటుంబానికి

రూ.1.20 లక్షల సాయం

అప్పుల ఊబి నుంచి తేరుకున్న చేనేత కుటుంబాలు

కూటమి రాకతో కుప్పకూలిన బతుకులు

ఆర్థిక సాయం ఎగనామం

మగ్గాలకు 200, పవర్‌లూమ్స్‌కు 500 యూనిట్ల ఉచిత కరెంట్‌కు పంగనామం

మళ్లీ మొదటికొచ్చిన నేతన్నల జీవితాలు

జాతీయ చేనేత దినోత్సవం నేడు

కూటమి ప్రభుత్వం నెరవేర్చని హామీలతో....

నెల్లూరు(స్టోన్‌హౌస్‌పేట): మన సంస్కృతి, సంప్రదాయాన్ని ఉట్టిపడేలా కనిపించేవి చేనేత వస్త్రాలు. అగ్గిపెట్టెలో ఇమిడే చీరలను నేసి చరిత్ర సృష్టించిన చేనేతలు అనాదిగా చంద్రబాబు పాలనలో దగాకు గురయ్యారు. చేనేతలను ఆదుకునేందుకు దివంగత సీఎం ఎన్టీఆర్‌ జనతా వస్త్రాల పథకానికి శ్రీకారం చుట్టారు. చంద్రబాబు అడ్డదారిలో అధికారాన్ని చేజిక్కించుకున్నా.. ఆ పథకానికి మంగళం పలికారు. తాను అధికారంలో ఉన్న 14 ఏళ్లు నేతన్నలకు చుక్కలు చూపించారు. వైఎస్సార్‌ హయాంలో చేనేతలను ఆదుకున్నారు. తిరిగి ఆయన కుమారుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక గత ప్రభుత్వాలకు భిన్నంగా చేనేతల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. వైఎస్సార్‌ నేతన్న నేస్తం ద్వారా ఏటా రూ.24 వేల వంతున ఐదేళ్లలో ఆయా కుటుంబాలకు రూ.1.20 లక్షల ఆర్థిక సాయంతోపాటు, నవరత్నాల పథకాల ద్వారా ప్రతి కుటుంబాన్ని ఆర్థికంగా అభివృద్ధి చెందేలా చేశారు.

ఆదుకోలేని చేనేత సొసైటీలు

జిలాల్లో 280కు పైగా చేనేత సొసైటీలు ఉన్నాయి. నేత కార్మికులకు ఉపాధి కల్పిస్తూ వారి జీవితాలను ఆనందంగా గడిపేలా ఈ సొసైటీలు పని చేశాయి. నేత కార్మికులకు ఉపాధి కల్పిస్తూ ఉండే సొసైటీలు నేడు కేవలం పుస్తకాల్లో రాసుకునేందుకే సంఖ్య సరిపోతుంది. జిల్లాలో కేవలం సౌత్‌మోపూరు, బుచ్చిరెడ్డిపాళెం, నారాయణరెడ్డిపేట, ఇందుకూరుపేట, నెల్లూరు స్టోన్‌హౌస్‌పేట సొసైటీలు మాత్రం అంతో ఇంతో కార్మికులకు పని కల్పిస్తున్నాయి. అయినా ఆ సొసైటీలు కల్పించే పనులతో ఏ కుటుంబం బతికే పరిస్థితి లేకపోవడంతో చేనేత కార్మికులు రకరకాల పనులతో జీవితం సాగిస్తున్నారు.

జిల్లాలో నేతన్న నేస్తం పథకం అమలు

కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఇచ్చిన పథకాలతోపాటు అదనంగా నేత మగ్గాలకు 200 యూనిట్లు, పవర్‌లూమ్స్‌కు 500 యూనిట్లు ఉచితంగా సరఫరా చేస్తామని నెరవేర్చలేని హామీలిచ్చింది. వీటితో మరో 25 రకాల హామీలిచ్చినా.. అధికారంలోకి వచ్చి రెండో ఏడాది గడుస్తున్నా.. చేనేత వర్గాలకు ఇచ్చిన హామీలు ఆయా కుటుంబాలకు అందని పరిస్థితి ఏర్పడింది. నూలు, రంగుల ధరలు, జీఎస్టీల దెబ్బ చేనేత పరిశ్రమ మూతపడే స్థాయికి చేరుకుంది. మగ్గం ఉన్న ప్రతి ఒక్కరూ కష్టాలను ఎదుర్కొంటున్నారు. కష్టపడి నేసిన వస్త్రాలు మార్కెట్‌ చేయాల్సిని ఆప్కో సంస్థ చేస్తున్న పనులు ఎవరికి అర్థం కాని పరిస్థితి. ఆప్కో నిర్వహించాల్సిన చేనేత సంఘాల ఎన్నికలకు డబ్బులు కూడా లేకపోవడంతో ఏ విధంగా సహాయ పడలేని పరిస్థితి ప్రభుత్వ నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది. తమను ఏ విధంగా ఆదుకోలేని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేనేత జాతీయ దినోత్సవాన్ని ఆర్భాటంగా నిర్వహించడం సిగ్గు చేటని నేతన్నలు దుయ్యబడుతున్నారు.

చేయూత ఇవ్వక చేనేతకు చుక్కలు 1
1/5

చేయూత ఇవ్వక చేనేతకు చుక్కలు

చేయూత ఇవ్వక చేనేతకు చుక్కలు 2
2/5

చేయూత ఇవ్వక చేనేతకు చుక్కలు

చేయూత ఇవ్వక చేనేతకు చుక్కలు 3
3/5

చేయూత ఇవ్వక చేనేతకు చుక్కలు

చేయూత ఇవ్వక చేనేతకు చుక్కలు 4
4/5

చేయూత ఇవ్వక చేనేతకు చుక్కలు

చేయూత ఇవ్వక చేనేతకు చుక్కలు 5
5/5

చేయూత ఇవ్వక చేనేతకు చుక్కలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement