
హైవేపై రోడ్డు ప్రమాదం
● ఒకరి మృతి, ఇద్దరికి తీవ్రగాయాలు
వరికుంటపాడు: మండలంలోని భోగ్యంవారిపల్లె సమీపంలో 565 జాతీయ రహదారిపై మంగళవారం తెల్లవారు జామున జరిగిన ప్రమాదంలో ఒకరు మృతిచెందగా ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసుల కథనం మేరకు.. నెల్లూరుకు చెందిన పూల రాజేంద్ర (44) తన బంధువులతో కలిసి శ్రీశైలం నుంచి నెల్లూరుకు కారులో వస్తున్నారు. దుత్తలూరు నుంచి ఒంగోలుకి మరో కారు వెళ్తోంది. భోగ్యంవారిపల్లి సమీపానికి వచ్చేసరికి రెండు వాహనాలు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ఘటనలో రాజేంద్ర అక్కడికక్కడే మృతిచెందాడు. కారులో ఉన్న మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. స్థానికులు క్షతగాత్రులను 108 అంబులెన్స్‌లో నెల్లూరులోని ప్రైవేట్ వైద్యశాలకు తరలించారు. సమాచారం తెలుసుకున్న వరికుంటపాడు ఎస్సై ఎం.రఘునాథ్ ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

హైవేపై రోడ్డు ప్రమాదం