
గ్రామంలో ఉన్నారని..
● సీపీఎం నేతల్ని అదుపులోకి తీసుకున్న
పోలీసులు
ఉలవపాడు: 30 పోలీస్ యాక్ట్ అమలులో ఉన్న రామకృష్ణాపురం గ్రామంలో తిరుగుతున్నారని సీపీఎం నాయకులను మంగళవారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ గ్రామంలో ఇంటింటి సర్వే జరుగుతోంది. సర్వే అవసరం లేదు.. డాక్యుమెంట్లు ఇవ్వొద్దని గిరిజనులకు నేతలు చెబుతున్న సమయంలో 20 మంది పోలీసులు వచ్చి స్టేషన్‌కు తరలించారు. వారిలో సీపీఎం ఉలవపాడు ప్రాంతీయ కార్యదర్శి జీవీబీ కుమార్, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లాకార్యదర్శి పుల్లయ్య, రైతు సంఘం జిల్లా కార్యదర్శి మూలి వెంగయ్య ఉన్నారు. తర్వాత పూచీకత్తుపై విడుదల చేశారు.